మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. ఈయన ఏం చేశారంటే..!

వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుసగా ఒకరి తర్వాత ఒకరిపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కటకటాల వెనక్కి కూడా వెళ్లారు.

Update: 2024-07-05 13:30 GMT

వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుసగా ఒకరి తర్వాత ఒకరిపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కటకటాల వెనక్కి కూడా వెళ్లారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారికి తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు ద్వారంపూడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ద్వారంపూడితో పాటు మరో 25 మంది పేర్లను కూడా జోడించారు పోలీసులు. కాకినాడు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

జూలై 2వ తేదీన కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్‌లో వైసీపీ నాయకుడికి చెందిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి మున్సిపల్ అధికారులు, పోలీసులు వెళ్లారు. కూల్చివేత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ద్వారంపూడి, ఆయన అనుచరులు అధికారులను తమ విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనుతిరిగారు. వారిలో మున్సిపల్ అధికారి తనను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారనంటూ ద్వారంపూడి, ఆయన ప్రధాన అనుచరుడు బళ్ళ సూరిబాబు సహా 24 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. కాగా ఈ కేసుపై దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఇటీవల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కుటుంబం కాకినాడలోని యాంకరేజ్ పోర్ట్‌ను కబ్జా చేశారని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆరోపించారు. దాంతో పాటుగా వారు రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు అనధికారికంగా సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో భాగంగానే తాను రెండు గోడౌన్‌లలో తనిఖీ చేయగా వారిటో భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించామని, దాదాపు 5,300 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

Tags:    

Similar News