పరిశ్రమల కాలుష్యానికి బలవుతున్న మత్స్య కారులు

సముద్రంలో విష పదార్థాలు వల్ల జీవరాసులు చనిపోతున్నాయి. మత్స్య కారులు వలసలు పోతున్నారు. ఈ పరిస్థితిని పర్యావరణ ఉద్యమ కారులు డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు.;

Update: 2025-01-30 17:35 GMT

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని సముద్ర తీరం కలుషిత జలాలతో ఉండడాన్ని పరిశీలించేందుకు పర్యావరణ పరిరక్షకులు డాక్టర్ రాజేంద్ర సింగ్ తో పాటు ఆయన బృందం పర్యావరణ నాయకుడు బోలిసెట్టి సత్యనారాయణతో బోయపాడు రాజుపేట, రేవుపోలవరం, పుడిమడక, నాగమయ్యపాలెం, జలరిపేట, పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, భీమిలి, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం లోని మత్స్య కార గ్రామాలలో పర్యటించారు.

ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల సముద్ర తీరం కలుషితమై మత్స్యాకులు జీవనోపాధి కోల్పోయారని పర్యావరణ పరిరక్షణ వేత్త డాక్టర్ రాజేంద్ర సింగ్ అన్నారు. సముద్రంలో కలుస్తున్న విష పదార్థాలపై ప్రత్యేకించి డాక్యుమెంట్ తీయాల్సి ఉందన్నారు. విశాఖపట్నం జిల్లాలో ప్రజల పైన, ప్రత్యేకించి మత్స్యాకుల పైన కాలుష్యం ఎటువంటి ప్రభావం చూపుతుందో ప్రభుత్వానికి తెలియదనుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరమంతా కలుషితమవుతోందన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి ఆదాయం కోసం కార్పొరేట్ శక్తులపై ప్రభుత్వం ఆధారపడటం వల్ల ఇటువంటి పరిణామాలు వస్తాయన్నారు. అందువల్ల కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా ఉంటాయని చెప్పారు.

అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేట ఏరియాలో భారీ బల్క్ డ్రగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును వెంటనే నిలుపుదల చేయాలని గ్రామాల వారు కోరుతున్నారన్నారు. డాక్టర్ రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇది పర్యావరణ విపత్తు అని, దీనిని పరిష్కరించడానికి మాకు హక్కులు లేవని, చెప్పడం వరకే తమ పని అని, దీనిని పరిష్కరించే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఉందన్నారు. భీమిలిలోని చిల్లపేట ట్యాంక్‌ను సందర్శించారు. 7 ఎకరాల భూమి, ట్యాంక్ ప్రాంతం మురుగు నీటితో మునిగి పోవడాన్ని గమనించినట్లు చెప్పారు. ఈ విపత్తును వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, వలస పక్షులను కాపాడాలని కోరారు.

Delete Edit

పర్యావరణ ఉద్యమ కారుడు బోలిసెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పరిశ్రమలను ఆపడం పరిష్కారం కాదని, కాలుష్యాన్ని ఆపడం పరిష్కారం మాత్రమే పరిష్కారం అని స్థానికులకు వివరించారు. కాలుష్యానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రజలను చైనత్య వంతం చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటోందన్నారు. నిబంధనలు అనుసరించి పరిశ్రమలు స్థాపిస్తే ఇబ్బంది లేదని, అలా కాకుండా నిబంధనలు తుంగలో తొక్కడం వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. కాలుష్యపు నీటితో చేపలు చనిపోతున్నాయని, తాబేళ్లు కూడా మృత్యు వాత పడుతున్నాయన్నారు.

రేవుపోలవరం చేరుకున్న మరో బృందం గ్రామానికి చెందిన మత్స్య కారులతో, ప్రజలతో ఉదయం 9 గంటలకు మాట్లాడారు. మత్స్య కార నాయకులు ఉమ్మిడి సంజీవరావ్, కొత్త రేపుపోలవరం, కర్రి సూరిబాబు, చెల్లూరి బంగారిచిట్టి, మాజీ సర్పంచ్ కోవిరి బాంగారి, దొండా నూకరాజు, చెల్లూరి యర్రయ్య, ఇతర స్థానిక లీడర్స్ కలిసి హెటెరో, సాయి మెరైన్ నుంచి కాలుష్యపు నీరు సముద్రంలోకి రావడాన్ని పరిశీలించినట్లు నాయకులు తెలిపారు. మత్స్యాకారులతో పాటు పర్యావరణ పరిరక్షణ నాయకులు ఉన్నారు. కాలుష్యం పరిశ్రమల నుంచి కాలువ ద్వారా సముద్రంలోకి రావడం వల్ల తీరంలోని నీరు చెడిపోయి మత్స్య కారులు చేపలు పట్టుకోలేక జీవన వనరులు కోల్పోయారన్నారు. చేపలు చనిపోవడం, ఇతర జీవరాసులు చనిపోవడం వల్ల అక్కడి మత్స్య కారులతో పాటు చాలా మంది ప్రజలు కూడా పట్టణాలకు వలసలు పోతున్నారన్నారు. మత్స్య కారులు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా వారి గురించి పట్టించుకోలేదని ప్రభుత్వ తీరును వారు దుయ్యబట్టారు.

రాష్ట్ర మత్స్య కార యూనియన్ రాష్ట్ర నాయకులు ప్రెస్సింగి అదినారాయణ, వారి ప్రతినిధులు మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. APPCB నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హోం మంత్రి అనిత స్థానిక ఎమ్మెల్యే కావడం వల్ల పరిశ్రమలు ఖచ్చితంగా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వ్యర్థాలు ఇలా ఎందుకు బయటకు వదులుతున్నారో మంత్రి నిర్థారించాల్సి ఉందని డాక్టర్ రాజేంద్ర సింగ్ మంత్రిని కోరారు. కాలుష్యం నివారించడానికి తగిన పరిష్కారం చూపాలని ఆయన కోరారు. అదృష్ట వశాత్తు ప్రస్తుత ప్రభుత్వం సమస్యను వినేందుకు సిద్ధంగా ఉందని, పర్యావరణ మంత్రి పవన్ కల్యాణ్ కాలుష్య నివారణ పనులు చేపట్టేందుకు కట్టుబడి ఉండటం సంతోషాన్ని కలిగించే అంశమన్నారు.

పూడిమడకలోని స్థానిక మత్స్యకారులను కలుసుకున్నట్లు చెప్పారు. ఈ కాలుష్యం కారణంగా జంతువులు, పక్షులు చనిపోవడం జరిగింది. దీంతో ఇక్కడి కాలుష్యాన్ని వీడియోలు, ఫొటోల ద్వారా పర్యావరణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోలిసెట్టి సత్యనారాయణ APPCB అధికారులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు పంపించినట్లు చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి ఆ ప్రదేశంలోనే కూర్చుని దీక్ష చేస్తానన్నారు.

లాసన్స్ బే కాలనీలో కాలుష్య మురుగు నీటి కాలువను పరిశీలించినట్లు తెలిపారు. అక్కడి పరిస్థితులు ఏ మాత్రం మారలేదని చెప్పారు. మరింత దిగజారాయన్నారు. డాక్టర్ రాజేంద్ర సింగ్ చివరిగా మాట్లాడుతూ మీడియా తన పాత్ర నిర్వహించి ప్రజలను కాపాడాలన్నారు. ప్రెస్ మీట్‌లో డాక్టర్ కిరణ్ చిట్లా, ప్రెస్సింగి అదినారాయణ, సంకు వెంకటేశ్వరరావు, దుగ్గిన బాబ్జీ పాల్గొన్నారు.

Tags:    

Similar News