ఐదు లక్షల జరిమానా..లైసెన్స్ రద్దు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మద్యం అక్రమాలపై ఉక్కు పాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయ్యింది.
By : The Federal
Update: 2024-12-02 13:27 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం వషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అక్రమాలను ఉపేక్షించేది లేని చెప్పిన ప్రభుత్వం, దానికి సంబందించిన చర్యలకు ఉపక్రమించింది. మద్యం అక్రమాలను నియంత్రంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం అక్రమాలకు పాల్పడితే జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకుంది. మద్యాన్ని అధిక ధరలకు విక్రయించినా, మద్యం దుకాణం పరిధిలో బెల్టు షాపులు నిర్వహించినా వారికి చుక్కలు చూపించనుంది.
ఆ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తే రూ. 5లక్షలు జరిమానా విధించేందుకు రంగం సిద్ధం చేసింది. అదే తప్పు రెండో సారి చేసిస్తే మాత్రం సంబంధిత మద్యం దుకాణం లైసెన్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణం పరిధిలో బెల్టు షాపులు నిర్వహిస్తే కూడా రూ. 5లక్షలు జరిమానా విధించనున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.