Ex PM MANMOHAN - EX MP | వైఎస్ వల్లే మంత్రి పదవి రాలేదు..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ - నాది అన్నదమ్ముల అనుబంధం. నన్ను ఆయన కేంద్ర మంత్రి చేయాలనుకున్నారని మాజీ ఎంపీ చింతా మోహన్ గుర్తు చేసుకున్నారు.

Update: 2024-12-27 11:01 GMT
కాంగ్రెస్ పార్టీ నేతలతో కలసిి ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్

మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు మంత్రి వర్గంలో మన్మోహన్ సింగ్ తోపాటు నేను కూడా మంత్రిగా పనిచేశానని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపసభలో డాక్టర్ చింతా మోహన్ గతాన్ని నెమరువేసుకున్నారు. మన్మోహన్ సింగ్ తో తనకు ఉన్న అనుబంధం, సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. మీడియా వద్ద కూడా ఆయన ఆయన మాటల్లోనే..

డాక్టర్ మన్మోహన్ సింగ్ నాకు చానా ఆప్తుడు. మేమిద్దరం అన్నదమ్ముల ఉండే వాళ్లం. ఇటీవల కాలంలో నేను, నా భార్య (చింతా రేవతి), డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య నలుగురం ప్రత్యేకంగా ఢిల్లీలో మన్మోహన్ సింగ్ నివాసంలో కలిసి మాట్లాడుకున్నాం.
నా మనవడు నా మనవడు అమెరికాలో ఉన్నాడు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. సంబంధం చూడమని మన్మోహన్ సింగ్ అడిగారు. ఏ కులమైనా పరవాలేదా అంటే, ఓకే అన్నారు. అని చెబుతూ, మన్మోహన్ సింగ్ కులాలకు అతీతమైన వ్యక్తిగా గుర్తు చేశారు.
2004లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా చేయాలనే ప్రతిపాదనను కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. దీంతో స్వయంగా నేనే కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ తో మాట్లాడి, ఒప్పించాను.
మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక వేత్త అని అందరూ అంటుంటారు. "మన్మోహన్ సింగ్ మంచి పొలిటిషియన్. అని అర్జున్ సింగ్ నాతో అన్నాడు." నిన్న కాక మొన్నొచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. నేను కాలేకపోయాను. అని అర్జున్ సింగ్ నాతో అన్నాడు.
నన్ను కేంద్ర మంత్రిగా చేయాలని డాక్టర్ మన్మోహన్ సింగ్ మూడుసార్లు ఎంతో ప్రయత్నం చేశాడు. (యూపీఏ ప్రభుత్వం హయాంలో) కానీ, వైఎస్. రాజశేఖరరెడ్డి నన్ను కేంద్ర మంత్రి కాకుండా అడ్డం పడ్డాడు.
అంతర్జాతీయ విమానాశ్రయం
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమానికి పదివేల మందితో మీటింగ్ చేయాలనేది నా కోరిక. దీనికి మన్మోహన్ సింగ్ అంగీకరించలేదు. వద్దు అసూయపడతారు. 500 మందితో మీటింగ్ పెట్టమని మన్మోహన్ సింగ్ సూచన చేశారు.
ఒక ఎంపీగా, దళిత వర్గం నుంచి వచ్చిన నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన సపోర్టుతో, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి లక్ష కోట్లు గ్రాంట్ తెచ్చాను.
అంతర్జాతీయ విమానాశ్రయం, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, ఏడు జాతీయ రహదారులు, సిమ్స్ కు ఎయిమ్స్ స్థాయి హోదా, 65 కోట్ల గ్రాంటు, 292 కోట్లతో 7008 మంది నిరుపేద మహిళలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సాధించాను.
1991లో నేను పీవీ క్యాబినెట్లో ఎరువులు రసాయనాలు శాఖ మంత్రిగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశాము.
తిరుపతి తో డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 45 సంవత్సరాల క్రితం జీఎన్. రెడ్డి వీసీగా ఉన్న రోజుల్లో మన్మోహన్ సింగ్ కు ఎస్వీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను అందజేసింది.
బేషజాలు తెలియని వ్యక్తులు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబానికి బేషజాలు లేవు. ఉండవు. ఆయన భార్య స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తూ, కూరగాయల మార్కెట్ కు వెళ్లేవారు. ఇంటికి అవసరమైన సరుకులు స్వయంగా కొని తెచ్చుకునేవారు. దిగజారిన స్థాయిలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు గొప్ప ఆర్థికంగా బలోపేతం దేశంగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది.
దరిద్రంలో ఉన్న భారతదేశాన్ని సంపన్న దేశంగా మార్చిన మహానుభావులు నలుగురే. వారిలో మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ మాత్రమే. "పదేళ్లు ప్రధానిగా పనిచేసినా, ఆర్థిక మంత్రిగా పనిచేసినా చిన్న మచ్చ కూడా లేకుండా, గడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. అటువంటి నాయకులు నేడు భారతదేశానికి కావాలి" అని డాక్టర్ చింతా మోహన్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News