ముదినేపల్లి వద్ద ఎగిసిపడ్డ మంటలు, జనం ఉరుకులు పరుగులు

ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ పైప్ లీక్ అయింది. రిలయన్స్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్ లైనును భూమికి పైపైన వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు

Update: 2024-04-15 09:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ పైప్ లీక్ అయింది. రిలయన్స్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్ లైనును భూమికి పైపైన వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో గ్యాస్‌ పైపులైన్‌ లీక్ అయి మంటలు పెద్దఎత్తున ఎగిసిపడడంతో చుట్టుపక్కల గ్రామాల వారు భయాందోళనలతో పరుగులు పెట్టారు. ప్రధాన రహదారి వెంట ఈ గ్యాస్ లీకయింది. సమీపంలోని చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. మంటల్ని ఆర్పే పనిలో పడ్డారు. ఇటీవల పెరికెగూడెం నుంచి డోకిపర్రు వరకు కేవలం రెండు అడుగుల లోతులోనే పైపు లైన్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో ప్రమాదం జరిగింది. కైకలూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో జనం ఊపిరి పీల్చారు. 

Tags:    

Similar News