Tirupati Gold ATM || ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గోల్డ్ ఏటీఎం.

తిరుపతిలో గోల్డ్ ఏటీఎం ఆకట్టుకుంటోంది.;

Update: 2025-02-18 14:17 GMT

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 19 వరకు ఈ ఎక్స్‌పో జరగనుంది. సాధారణంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే కచ్చితంగా జ్యువెలరీ షాపుకు వెళ్తూ ఉంటాం. బులియన్ మార్కెట్ ధరకన్నా ఎక్కువ ధరలు పెట్టి బంగారం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఆభరణాలు కొంటే వాటికి కూలీ, తరుగు అంటూ ఏవేవో ఉంటాయి.

Full View

వాటిపై మరింత సుంకం వసూలు చేస్తారు దుకాణదారులు. తీరా కొన్నాక 24 క్యారెట్ బంగారం ధర మన వద్ద వసూలు చేసి కేవలం 18 క్యారెట్ బంగారు ఆభరణాలు లేదా 22 క్యారట్ జ్యువెలరీ అంటగట్టే దుకాణాలు ఉన్నాయి. ఇలాంటి టెన్షన్ లేకుండా. కూలీ, తరుగు అనే మాట లేకుండా ఉండాలంటే ఒకటి బంగారం బిస్కెట్స్ రూపంలోనో” కాయిన్స్ రూపంలోనో కొనుగోలు చేయాలి. బిస్కెట్ రూపంలో అందించే బంగారంలోకి మోసాలు జరుగుతున్న సందర్భాలలో హిరణ్యని బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ పసిడి ప్రియులకు సరికొత్త విధానాన్ని పరిచయం చేస్తోంది.


తరుగు, కూలీ లేని బంగారు కాయిన్స్‌ను నేటి మార్కెట్ ధరకే కొనుగోలు చేసేలా నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ గోల్డెన్ ఏటీఎం సేవలందించే అవకాశం ఉంది


Tags:    

Similar News