సంస్కారంతో నమస్కారం చేశా..కాళ్లు పట్టుకోలేదు

బొత్స కుటుంబంపై తన కుటుంబం గత 40 ఏళ్లుగా పోరాటం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు.

Update: 2024-12-29 04:43 GMT

నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో అసెంబ్లీ లాబీలో ఇతర ఎమ్మెల్యేలతో పాటు తాను కూర్చుని ఉండగా, అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అటువైపు వచ్చారని, సీనియర్‌ నాయకుడు కావడంతో అక్కడ కూర్చుని ఉన్న ఎమ్మెల్యేలు లేచి ఆయనకు నమస్కారం చేశారని, అందరితో పాటు తాను కూడా లేచి సంస్కారంతో పలకరించానని.. అంతకు మించి ఏమీ జరగ లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కాళ్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పట్టుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. బొత్స సత్యనారాయణ కాళ్లు నేనెందుకు పట్టుకుంటానని అన్నారు. తమ కుటుంబానికి, బొత్స సత్యనారాయణ కుటుంబానికి విజయనగరం జిల్లాలో ఎప్పటి నుంచో రాజకీయ వైరం ఉందన్నారు. గత 40 ఏళ్లుగా బొత్స సత్యనారాయణ కుటుంబంపై తమ కుటుంబం రాజకీయ పోరాటం చేస్తోందని అన్నారు. అలాంటిది బొత్స సత్యనారాయణ కాళ్లు నేనెలా పట్టుకుంటానని ప్రశ్నించారు. దీనిపై సామాజి మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బొత్స సత్యనారాయణ కానీ, ఆయన కుటుంబం కానీ విజయనగరం జిల్లాకు చేసేందేమీ లేదని అన్నారు. బొత్స సత్యనారాయణ కుటుంబం వల్ల సమస్యలు ఎదుర్కొన్న బాధితులు, అన్యాయమైన కుటుంబాలు న్యాయం కోసం తన వద్దకు వస్తున్నారని, దీనిపై ఖచ్చింతంగా చర్యలు తీసుకుంటానన్నారు. బాధితులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటానన్నారు. 

Tags:    

Similar News