Tirupati | ఒకే సీటు గెలిచిన టిడిపి నేత డిప్యూటీ మేయర్ ఎలా అయ్యారు?
తిరుపతిలో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. వైసీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లు అండగా నిలిచారు. టిడిపి నేత డిప్యూటీ మేయర్ అయ్యారు.;
తిరుపతి నగర పాలక సంస్థలో టిడిపి పాదం మోపింది. డిప్యూటీ మేయర్ పదవిని టిడిపి కూటమి దక్కించుకుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ( Sri Venkateswara University) సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ (deputy Mayor) పదవికి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మంగళవారం మళ్లీ ఎన్నిక నిర్వహించారు. తిరుపతి కార్పొరేషన్ లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని టిడిపి కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ విజయం సాధించారు. దీంతో గత మూడు రోజులుగా తిరుపతిలో టిడిపి కూటమి నేతలు, వైసీపీ మధ్య జరుగుతున్న హైడ్రామా కు తెరపడింది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. అందులో ఒక స్థానంలో మాత్రమే టిడిపి అభ్యర్థి ఆర్ సి. మునికృష్ణ విజయం సాధించారు. మిగతా 49 స్థానాలను వైసిపి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. కాగా, తిరుపతి కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్లుగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయరెడ్డి, ముద్ర నారాయణ డిప్యూటీ మేయర్లుగా కొనసాగారు.
2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. ఈ ఎన్నికలకు ముందే తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన భూమన అభినయ రెడ్డి తన డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు వివిధ కారణాల రీత్యా టిడిపి కూటమి వైపు మొగ్గు చూపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ పదవికి సోమవారం ( ఫిబ్రవరి 3) నిర్వహించిన సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఎన్నికల అధికారి, తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మళ్లీ మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు.
మారిన బలాలు
ఓటమి అధికారంలోకి రావడంతో తిరుపతి నగరపాలక సంస్థలో ప్రాతినిథ్యం వహిస్తున్న కార్పొరేటర్లు గత ఏడాది టిడిపి ఓటింగ్ వైపు కొంతమంది వచ్చారు. ఎస్ వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో మంగళవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో 21 మంది కార్పొరేటర్లు వైసిపికి, 26 మంది పార్టీ ఫి ఆ పార్టీ కార్పొరేటర్లు టిడిపి అభ్యర్థి ఆర్ సి మునికృష్ణకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 50 డివిజన్లలో ఒకే చోట మాత్రమే గెలిచిన టిడిపి అభ్యర్థి ఆర్ సి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు.
కనిపించని ఎమ్మెల్సీ
జెడ్పిటి మేయర్ ఎన్నికల్లో తిరుపతికి చెందిన రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తో పాటు డాక్టర్ సిపాయి కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు నేపథ్యంలో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ని టిడిపి కూటమి నేతలు కిడ్నాప్ చేశారనే వదంతులు విస్తృతంగా వ్యాపించాయి.
" ఆయనను బయటికి రానివ్వకుండా టిడిపి కూటమి నేతలు కట్టడి చేశారు" పని విశ్వసనీయ సమాచారం. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఓటు కీలకం అనే భావించే, టిడిపి కూటమినేధులు ఈ ఎత్తుగడ వేసినట్లు భావిస్తున్నారు. మొత్తానికి తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారంలో రాజకీయంగా అనేక ఆవిడ్రామాలకు తెరతీసింది. ఇది విపక్ష వైసిపి, అధికార టిడిపి కూటమిలో ఆధిపత్యపోరు తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి అనేది వేచి చూడాల్సిందే.
టిడిపి సంబరం
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వద్ద టీడీపీ నేతల సంబరాలు మిన్నంటాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన ఆర్ సి మునికృష్ణ సెనేట్ హాల్ వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి అభివాదం చేశారు. టిడిపి, జనసేన నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.