జగన్ పొలిటీషియన్ ఎలా అవుతారు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల గురించి ఆలోచించి మాట్లాడాలి. ఎలాబడితే అలా మాట్లాడితే సహించేదే లేదని లోకేష్ అన్నారు.;
ప్రజలు చంద్రబాబును, పవన్ కల్యాణ్‌లను భారీ మెజారిటీతో గెలిపించారు. గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నారు. వారి మీద మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. అగౌరవంగా మాట్లాడితే సహించేది లేదు. కించపరిచే విధంగా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. భారీ మెజారిటీతో కూటమి ఎమ్మెల్సీలు గెలిచారు. దీంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భయం పట్టుకుంది. దీంతో బెంగుళూరు నుంచి హడావుడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. రెండు రోజులు ఉంటారు. రెండు రోజుల తర్వాత బెంగుళూరుకు వెళ్లిపోతారు అని లోకేష్ జగన్ మీద మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద నిప్పులు చెరిగారు. చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తామని ప్రశ్నించారు. చట్టాన్ని ఉలంఘించడం జగన్‌కు బాగా అలవాటే. అందుకే జగన్ మీద అన్ని కేసులు ఉన్నాయని అన్నారు.