ఆ గౌరవం నాకే దక్కింది
అనుభవంతో పాటు పార్టీకి పరిగెత్తే యువ రక్తం అవసరమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్. ఆ విషయాన్ని ఆయనే ధృవీకరించారు. ప్రధాని మోదీతో సహా ఇతర రాజకీయ నాయకులందరూ తన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారని ఇది వరకు ఓ సందర్భంలో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ వెల్లడించారు. అంత సీనియర్ పోలిటీషియన్ అయిన చంద్రబాబుకు ఇటీవల దైవ భక్తి కూడా బాగా పెరిగింది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన తన భార్య భువనేశ్వరితో కలిసి తీర్థ యాత్రలు చేసి తన భక్తిని చాటుకున్నారు. ఇప్పుడు కర్మ సిద్ధాంతంపైన కూడా సీఎం చంద్రబాబుకు నమ్మం ఉన్నట్లు తన మాటల్లో వ్యక్తం అవుతోంది. పూర్వ జన్మ పుణ్యం, పాపం గురించి ప్రస్తావిస్తూ కర్మ సిద్ధాంతంపై తనకు నమ్మం ఉందనే విషయాన్ని వెల్లడించారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. ప్రజలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని, దీని వల్ల గత 41 ఏళ్లుగా తాను అసెంబ్లీకి వెళ్తున్నానని మాట్లాడిన సీఎం చంద్రబాబు, దీని వల్ల ఎవరకీ దక్కని ఇలాంటి అరుదైన గౌరవం తనకు దక్కిందని, ఇది తన పూర్వ జన్మ పుణ్యమని పేర్కొన్నారు. పూర్వ జన్మలో పుణ్యం చేసుకున్నందు వల్లే తనకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కిందని చెబుతూ.. తనకు కర్మ సిద్ధాంతంపై కూడా నమ్మం ఉందనే విశ్వాసాన్ని వెల్లడించారు.