డిజిటల్ ప్రైవసీ యాక్ట్ రాబోతోందా?
త్వరలో డిజిటల్ మీడియా యాక్ట్ రాబోతోంది. డిజిటల్ మీడియాను ఉపయోగించి తప్పులు చేస్తున్న వారికి శిక్షలు ఉండాలి. ఎవరు అన్నారు? ఎందుకు అన్నారు? ఎక్కడ అన్నారు?
సాంకేతికత పెరుగుతోంది. కానీ దానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో తప్పులు పెరిగి పోతున్నాయి. ఈ తప్పులను అరికట్టాలి. అందుకే డిజిటల్ మీడియా ప్రైవసీ యాక్ట్ రాబోతోందని పాలకులు చెబుతున్నారు. అంటే సోషల్ మీడియాలో అంత ఘోరాలు జరుగుతున్నాయా? అవి చూసి పాలకులు సహించి ఊరుకుంటున్నారా? అంటే సందేహమే. ఇంతకూ డిజిటల్ మీడియా అన్నది నేడు దేశంలో ఓ పెద్ద విప్లవం. ఒకప్పుడు కేవలం ప్రింట్ మీడియాపైనే ఆధార పడిన ప్రజలు నేడు డిజిటల్ మీడియాపై ఆధార పడ్డారు. ఇంతకు ముందు ఎలక్ట్రానిక్ మీడియాపై ఆధార పడ్డారు. దీనిని ఎవరైనా నమ్మాలి. కానీ జనసేన పార్టీ అధ్యక్షులు, సినీ హీరో పవన్ కళ్యాణ్ మాత్రం చాలా వైరాగ్యంతో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న వారికి కఠిన శిక్షలు పడాలనేది కూటమి ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
ఒక పక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి ఇరువురూ కలిసి జర్నలిస్టుల జోలికి ఎవరు వచ్చినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఇటీవల పేర్కొన్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏకంగా డిజిటల్ మీడియాను శత్రువు గాను, కఠిన శిక్షలు పడాలన్న ఆలోచనతోనూ వారిపై విరుచుకు పడుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా డిజిటల్ మీడియా ఓ భాగంగా ఉంటుందనే విషయాన్ని మరిచి పోయినట్లు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నది కేవలం తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి గురించేనని చెప్పాల్సి వచ్చినప్పుడు దానిపై ప్రత్యేమైన హెచ్చరికలు ఎందుకు ఉంటాయి. చర్యలు తీసుకోవచ్చు కదా. అంటే.. భావ ప్రకటనా స్వేచ్చను నిరోధించే అవకాశం ఏ ఒక్కరికీ లేదు. అందుకే ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నట్లున్నారని డిజిటల్ మీడియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. నేడు అన్ని మీడియాల కంటే డిజిటల్ మీడియా సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తోందన్నారు.