ఓవర్ యాక్షనే రాజు కొంపముంచిందా ?
ఎలాగైనా జగన్ను జైలుకు పంపాలన్న ఉద్దేశ్యంతో కోర్టుల్లో కేసులు కూడా వేశారు. అయితే ఎంత ప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు.
ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో టాక్ ఆఫ్ ది టాపిక్ లేదా నియోజకవర్గం ఏమిటంటే నరసాపురమనే చెప్పాలి. ప్రస్తుతం నరసాపురం ఎంపీగా రెబల్ నేత రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. ఈయనకు ఏవో గట్టుతగాదాలు రావటంతో ముందు పార్టీకి తర్వాత జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. అప్పటినుండి జగన్ పైన ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఎలాగైనా జగన్ను జైలుకు పంపాలన్న ఉద్దేశ్యంతో కోర్టుల్లో కేసులు కూడా వేశారు. అయితే ఎంత ప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు. ఈ నేపధ్యంలోనే రాజుగారు కేసుల్లో ఇరుక్కోవటం, సీఐడీ అధికారులు అరెస్టుచేసి విచారించటం అందరికీ తెలిసిందే.
విచారణలో తనను చావగొట్టారని చేసినగోల దేశమంతా కలకలం రేగింది. అప్పటినుండి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కంకణం కట్టుకున్నారు. అందుకనే జగన్ కు బద్ద వ్యతిరేకులైన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో చేతులు కలిపారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటు రచ్చబండ పేరుతో ప్రతిరోజు జగన్ కు వ్యతిరకంగా గోలగోల చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీచేసి జగన్ కు తన సత్తా ఏమిటో చూపిస్తానని చాలాసార్లు చాలెంజులు విసిరారు. తన చాలెంజును నిలుపుకోవటానికి టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవటంలో తెరవెనుక చాలా కష్టపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రాజే చెప్పారు.
సరే ఇవన్నీ చరిత్రని అనుకుంటే వర్తమానం ఏమిటంటే రాజుగారికి అసలు టికెట్టే దక్కలేదు. ఏ పార్టీ కూడా రాజుకు టికెట్ ఇవ్వటానికి ఇష్టపడలేదు. దాంతో రాజుకి అసలు షాక్ ఇప్పుడే తగిలిట్లయ్యింది. ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వటానికి ఇష్టపడలేదంటే ఇందులో రాజు ఓవర్ యాక్షన్ ఎంతుందో అర్ధమవుతోంది. విషయం ఏమిటంటే ఈరోజుకు కూడా రాజు టీడీపీ, జనసేన, బీజేపీల్లో ఎందులోను చేరలేదు. ఏ పార్టీలోను సభ్యుడు కాకుండానే టికెట్ తెచ్చుకోవాలని రాజు చేసిన ప్లాన్ బెడిసికొట్టింది.
రాజను మీ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వమంటే కాదు మీరే చేర్చుకుని టికెట్ ఇవ్వమని చంద్రబాబు, పవన్ ఒకళ్ళతో మరొకళ్ళు మాట్లాడుకున్నారు. చివరకు ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని పొత్తులో బీజేపీకి వదిలేశారు. బీజేపీ అభ్యర్ధిగా రాజుకు టికెట్ ఇప్పంచాలన్న చంద్రబాబు వ్యూహం వర్కవుట్ కాలేదని తెలిసింది. నియోజకవర్గాన్ని బీజేపీ తీసుకున్నది కాని టికెట్ మాత్రం భూపతిరాజు శ్రీనివాసరాజుకు కేటాయించింది. దీన్ని రఘురాజు తట్టుకోలేకపోతున్నారు.
2019లో టీడీపీలో రాజుకు చంద్రబాబు టికెట్ ఫైనల్ చేస్తే కాదని వైసీపీలో చేరారు. వైసీపీ తరపున గెలిచిన కొద్దిరోజులకే జగన్ తో గొడవపడ్డారు. జగన్ తో పడక వైసీపీ నుండి బయటకు వచ్చేసి వ్యతిరేకంగా కేసులు వేశారు. ఇదంతా దేన్ని సూచిస్తోందంటే రాజు పదవికే లాయల్ కాని పార్టీకి కాదని. అందుకనే బీజేపీ కూడా రాజును పక్కనపెట్టేసింది. అంతా అయిపోయాక ఇపుడు జగన్ను దెబ్బకొట్టకపోతే తనపేరు రఘు కాదని మళ్ళీ చాలెంజ్ చేస్తున్నారు. సోమువీర్రాజును అడ్డుపెట్టుకుని తనకు టికెట్ రాకుండా చేయటంలో జగన్ విజయంసాధించినట్లు రాజు ఏడుపుగొంతుతో చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఏ పార్టీలోను చేరకుండానే టికెట్ కావాలంటే ఎవరూ ఇవ్వరన్న విషయం తెలియకుండానే రాజు ఇంతకాలం రాజకీయం చేశారా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.