సీఎం చంద్రబాబు అన్ని రోజులు ఉండవల్లి ఇంటికెళ్లంది అందుకేనా ?
సీఎం చంద్రబాబు దాదాపు 10రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉండి వరద సహాయక చర్యలు చేపట్టారు. మంగళవారం ఉండవల్లి నివాసంలోకి వెళ్లారు. ఏంటి సీక్రెట్?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు. ఎందుకు అన్ని రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉన్నారు. అక్కడ నుంచే ఎందుకు వరద సహాయక చర్యలు చేపట్టారు అనేది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు ఇలా చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణా నదికి భారీ స్థాయిలో వచ్చిన వరద ప్రవాహానికి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇల్లు మునిగి పోయిందని, దీని వల్ల అక్కడ నుంచి ఆయన బయటకు రావడం తప్ప లేదని, ఇదే సమయంలో విజయవాడ నగరం ముంపునకు గురి కావడంతో విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉంటూ సహాయక చర్యలు చేపట్టారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లే వరదలో మునిగి పోతే ఇక ముంపునకు గురైన సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకుంటారనే టాక్ బయటకు వస్తే సీఎంపై ప్రజల్లో నమ్మకం పోతుందని, అందువల్ల నీట మునిగిన విషయాన్ని బయకు పొక్కనీకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే టాక్ ఉంది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జైభీమ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరేవిగా ఉన్నాయనే చర్చ నడుస్తోంది.