జీఎస్ఎల్వీ- ఎఫ్ 16 ప్రయోగం గ్రాండ్ సక్సెస్
ఇస్రో, నాసా సంయుక్త ప్రయోగం సక్సెస్, శాస్త్రవేత్తల హర్షాతిరేకాలు;
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం విజయాల పరంపరలో గురువారం సాయంత్రం మరో రికార్డు నమోదైంది.
ఇస్రోతో కలిసి నాసా మొదటిసారి శ్రీహరికోటలోని shar తో కలిసి నుంచి nisar (NASA, ISRO synthetic aperture rodar) రాకెట్ విజయవంతమైంది. సూళ్లూరుపేటలోని షార్ కేంద్రంతో పాటు అమెరికాలోని నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తల్లో కూడా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
నింగిలోకి దూసుకుపోతున్న ఇస్రో-నిస్సార్ ఉపగ్రహం..
ISRO, NASA సంయుక్తంగా నిస్సార్ ఉపగ్రహాన్ని తయారు చేశాయి. ఈ ఉపగ్రహం తయారీకి 1.5 బిలియన్ డాలర్లు అంటే 13 వేలకోట్ల రూపాయలు వెచ్చించాయి. ఈ ఉపగ్రహం నిర్ణీత కక్షలోకి వెళ్లిన తర్వాత ప్రపంచ భూభాగాన్ని 12 రోజుల్లోనే జల్లెడ పట్టే (స్కాన్)సామర్థ్యం తో కూడిన పరికరాలను ఇందులో అమర్చారు.
"భూమికి సంబంధించిన అత్యంత ఖచ్చితమైన రీతిలో నిస్సార్ ఉపగ్రహం చిత్రాలను అందిస్తుంది" అని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణ మీడియాకు చెప్పారు.
ఈ ఉపగ్రహం ద్వారా భూమిలోని అణువణువును స్కాన్ చేయవచ్చు. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలను శోధించవచ్చు. పంటలు, జలవనరులు ఇలా ప్రతి ఒక్కటి నింగి నుంచి భూమిపై ఉన్న ప్రతి అణువును జల్లెడ పట్టడానికి ఆస్కారం ఏర్పడింది.
ISRO తో కలిసి నాసా తయారుచేసిన ఈ రాకెట్ బుధవారం సాయంత్రం ఐదు గంటల 40 నిమిషాలకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన శాటిలైట్ GSLV f-16 నింగిలోకి 2392 బరువు ఉన్న నిసార్ ఉపగ్రహాన్ని మోసుకుని వెళ్ళింది.
సూళ్లూరుపేట సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి నిస్సార్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 27.30 సుదీర్ఘ టౌన్ టౌన్ తర్వాత జిఎస్ఎల్వీఎఫ్ 16 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
ఇదిలా ఉంటే ఇస్రో, నాసా సంయుక్తంగా మొదటిసారి తయారుచేసి ప్రయోగించిన ఈ ఉపగ్రహం తీరును పరిశీలించడానికి ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు అమెరికా నుంచి కూడా నాసా శాస్త్రవేత్తలు షార్ కి చేరుకున్నారు. గతం నేర్పిన పాఠాలు నేపథ్యంలో జి ఎస్ ఎల్ వి ఎఫ్ 16 రాకెట్ ప్రయోగం సక్సెస్ చేయడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఈ రాకెట్ ప్రయోగాల్లో రెండుసార్లు విఫలం కావడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకున్నారు.
Nisar శక్తి అపారం
ఇస్రో తో కలిసి నాసా నింగిలోకి పంపిన నిసార్ సాటిలైట్ తో భూమిపై డేగ కన్ను వేయనుంది. ఈ ఉపగ్రహం నిర్ణీత కక్షలోకి వెళ్లిన తర్వాత భూ ప్రపంచాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేయగలదు. ఆదిశగా అధునాతన శాస్త్ర సాంకేతిక పరికరాలను బెంగళూరులోని ఈ వార్ రావు స్పేస్ సెంటర్ లో సాటిలైట్ ను రూపొందించారు. ఈ శాటిలైట్ ద్వారా భూమికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలకు శాస్త్రవేత్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఈ శాటిలైట్ ద్వారా...
నిస్సార్ ఉపగ్రహం నుంచి అధిక రిజర్వేషన్ డేటా ద్వారా దేశంలోని తీర ప్రాంతాలను పర్యవేక్షిస్తారు.
డెల్టా ప్రాంతాల్లో వార్షిక భౌగోళిక మార్పులపై కూడా అధ్యయనం చేస్తారు.
సముద్రం పై మంచు కదలికల పరిశీలన కూడా నిసార్ ఉపగ్రహంతోనే పర్యవేక్షించునున్నారు.
అంటార్కిటిక్ పోలార్ స్టేషన్ల చుట్టూ ఉన్న సముద్రాల మీద ఉండే లక్షణాలు పరిస్థితుల ను కూడా పర్యవేక్షిస్తారు.
పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిద్యం, వృక్ష సంపద, భూగర్భ జలాలు, సముద్ర మట్టం పెరుగుదలతో పాటు భూకంపాలు, సునామి, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులను కూడా పర్యవేక్షించి గుర్తించడానికి వీలుగా ఈ ఉపగ్రహంలో పరికరాలను అమర్చారు.
నిస్సార్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ తిరుమల శ్రీవారి ఆలయం తో పాటు, సూళ్లూరుపేట వద్ద సెంటిమెంట్ గా భావించే చెంగాలమ్మ ఆలయంలో కూడా రాకెట్ నమోనా ఉంచి పూజలు చేశారు.