విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల్లోకి తేవడం మా బాధ్యత: కేంద్ర మంత్రి వర్మ

విశాఖ ఉక్కు పరిశ్రమను లాభాల్లో తెచ్చేందుకు కేంద్రం సమాలోచనలు చేస్తోంది.

Update: 2024-09-28 09:37 GMT

సెయిల్‌ ఆధ్వర్యంలోని అనేక పరిశ్రమలు లాభాల బాటలో నడుస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా సెయిల్‌లో కలిపితే నష్టాల నుంచి బయట పడొచ్చనే అభిప్రాయాన్ని ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. ఢిల్లీలో ఆయన శనివారం మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందని, పదే పదే అలాంటి నష్టాన్ని భరించడం కేంద్రానికి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే సెయిల్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమను కలిపేందుకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌) చాలా ప్రతిష్టాత్మకమైన పరిశ్రమని, సెయిల్‌ కూడా లాభాల భాటలో పయనిస్తోందని అన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకొని పోయిందన్నారు. సెయిల్‌ ఆధ్వర్యంలోని అనేక ఉక్కు పరిశ్రమలు లాభాల బాటలో నడుస్తున్నాయన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలకు నష్టం కలగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సెయిల్‌లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను విలీనం చేసే అంశంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. విలీనంపై ఎక్‌సర్‌సైజ్‌ చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు.



Tags:    

Similar News