జగన్ చీఫ్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాల ఖరీదెంతో తెలుసా?

సలహాలు ఊరికే రావు. బాగా ఖర్చుచేయాలి. అందుకే జగన్ సర్కార్ లో ఖరీదైన సలహా లిచ్చేందుకు 89 మంది ఉన్నారు. వాళ్లకయిన ఖర్చు చూస్తే కళ్లు తిరుగుతాయి. వివరాలు

Update: 2024-02-01 13:03 GMT
ఫోటో : సాక్షి దినపత్రిక

ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఎందురు సలహాదారులున్నారు.

వారి కోసం గత నాలుగున్నరేళ్లలో ఖర్చు చేసిందెంత?

ఈ విషయాలు ఎపుడూ పెద్దగా చర్చకు రాలేదు. ఈ సలహాదారులెవరో కూడా తెలియదు. ఎంతసేపు సజ్జల రా మకృష్ణారెడ్డి కనిపిస్తూ ఉంటారు. ప్రభుత్వానికి అజ్ఞాత సలహాదారులు ఎందరో ఉన్నారు. ప్రభుత్వ టర్మ అయిపోతున్నందున సలహాదారుల సలహాలే మిటిఝ  వాటికయిన ఖర్చే మిటి ప్రజలకు తెలియాల్సిన సమయం వచ్చిందని   జనసేన పార్టీ అంటున్నది..  

జగన్ నాయకత్వంలోని  వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లు.

ఇందులో ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు. ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సలహాదారులు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏమిటో అర్థంకావు.  ఆ సలహాల వల్ల తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల అందిన అభివృద్ధి ఫలాలు ఎమిటో ఎవరికి తెలియదు.. అసలు ఎవరికి ఎంత మొత్తం ఖర్చు చేశారో తెలియదు.   శాసనసభ బడ్జెట్  సమావేశాల్లో ఈ ప్రశ్నలకు   ప్రభుత్వం సమాధానం చెప్పాల’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండు చేశారు.

ముఖ్యమంత్రికి   సుమారుగా 89 మంది సలహాదారులు ఉన్నారు... ఈ ముఖ్యమంత్రికి తన ప్రభుత్వంలో సలహాదారులు ఎంత మంది ఉన్నారో, వారి పేర్లేమితో ముఖ్యమంత్రికి కూడా తెలియదన్నారు. అసలు ఈ సలహాదారుల వివరాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచుతున్నది. అలా ఎందుకు ఉంచుతుందో కూడా బయటపెట్టాలని కోరారు.

గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ  నాదెండ్ల మనోహర్ గారు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. 


నాదెండ్ల మనోహర్ 

ఆయన వెల్లడించిన వివరాలు

  ‘‘ ఇబ్బడిముబ్బడిగా, ఏ అర్హత లేకున్నా వైసీపీ ప్రభుత్వం నియమించిన సలహాదారుల విషయంలో ప్రభుత్వం మొదట్లోనే కేసును ఎదుర్కొంది. సలహాదారుల సంఖ్య చూసి జిల్లా కలెక్టర్లకు కూడా సలహాదారులను నియమిస్తారేమో అని గౌరవ హైకోర్టు ఆశ్చర్యపోయింది. సలహాదారులు కూడా ప్రజాసేవకు నియమితులైనవారే అనీ, అంతా తగిన అర్హతలు ఉన్నవారినే నియమించామని కూడా తెలియజేసింది. ప్రభుత్వం ఆయా శాఖలవారీగా ఏ నిర్ణయం తీసుకున్నా, సలహాదారులను అడిగే తీసుకుంటున్నామని తెలిపింది. ప్రభుత్వం వారి వివరాలను మాత్రం బయటపెట్టలేదు.

సలహాలతో తీసుకువచ్చిన పాలసీలు ఏమిటి?

సలహాదారులు సైతం ముఖ్యమంత్రిని, ప్రభుత్వ అధికారులను కలవలేని దౌర్భగ్య పరిస్థితి ఉంది. దీంతోనే వైసీపీ నియమించిన సలహాదారుల్లో కొందరు రాజీపడలేని వ్యక్తులు ఉన్నారు. వారు రాజీనామా చేసి వెళ్లిపోయారు.  సుభాష్ గార్గ్,  రామచంద్రమూర్తి, జుల్ఫీ లాంటి వారు ఈ ప్రభుత్వంలో తమ సలహాలు ఎవరూ వినేవారే లేరని తెలుసుకొని వెళ్లిపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో తమ అనుకున్న వారి కోసం వేతనాలు, వారి ఖర్చులు, ఇతర సిబ్బంది ఖర్చుల కోసం రూ.680 కోట్లు వెచ్చించారు. వీరి ఇచ్చిన సలహాలు ఏమిటో, దాని వల్ల తీసుకున్న పాలసీలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలి.

సమాంతర పాలన కోసమేనా?

అసలు ఇప్పటికీ ఎంత మంది సలహాదారులున్నారు, వారికి నెలవారీ అవుతున్న ఖర్చులు, వారిచ్చిన సలహాలు, సూచనలపై ప్రజలకు ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలి. 89 మంది సలహాదారుల్లో ముఖ్యమంత్రికి ఎంత మంది తెలుసో కూడా చెప్పాలి. హైకోర్టు కూడా ఇది అనవసర ఖర్చు, అవవసర హంగామా అని ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ప్రభుత్వంలో ఎంతో మెరికల్లాంటి అధికారులను, మంత్రులను ఉపయోగించుకోకుండా ప్రభుత్వం కావాలనే వారిని పక్కన పెట్టింది. సమాంతర పాలన తీసుకువచ్చేందుకు రూ.680 కోట్లు దానికి వెచ్చించడం అంటే మాటలు కాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాలి. వీరికి ఏ పద్దు కింద జీతాలు, అలవెన్సులు, ఇతర ఖర్చులను చేశారో సమాధానం చెప్పాలి. ఒక ముఖ్య సలహాదారుకి రూ.140 కోట్లు ఖర్చు చేయడంలో ఆంతర్యం ఏమిటో కూడా ప్రజలకు తెలియాలి.



Tags:    

Similar News