మందుబాబుల వీక్‌నెస్‌పై జగన్ దెబ్బ
లిక్కర్ షాపులు తగ్గించారు. ఆదాయం మాత్రం ఆమాంతంగా పెరిగి పోయింది. అదే మరి సీక్రెట్.. అంటే;
Byline : The Federal
Update: 2024-03-07 13:15 GMT
జి. విజయ కుమార్
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా మద్యంపై ఆదాయం పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం తొలి ఏడాది రూ. 3,642 కోట్లు వచ్చింది. అది క్రమంగా పెరుగుతూ పోయింది. రెండో ఏడాది రూ. 4,386కోట్లు నుంచి 2019 నాటికి రూ. 6220 కోట్లకు చేరింది. అయితే అప్పుడు మద్యం దుకాణాలు కూడా ఎక్కువుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులు ఉన్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని క్లోజ్ చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారం చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4,380 లిక్కర్ షాపులు ఉన్నాయి. తొలి ఏడాదిలో అంటే 2019–20లో 6914 కోట్లు వచ్చిన ఆదాయం క్రమగా పెరుగుతూ వచ్చింది. అయితే రెండు విడతల్లో వాటిని తగ్గించారు. ప్రస్తుతం 2944 లిక్కర్ షాపులు నడుస్తున్నాయి. అంటే దాదాపు 1436 షాపులు తగ్గించినా ఆదాయంలో మాత్రం తగ్గుదల కనిపించ లేదు. గతేడాలో రూ. 11,309 కోట్ల వరకు ఆదాయం వచ్చి చేరింది.
జగన్ చెప్పిందేమిటి..చేస్తున్నది ఏమిటి
తాను అధికారంలోకి వస్తే లిక్కర్ షాలు లేకుండా చేస్తామన్నారు. ప్రతి ఏటా షాపులను తగ్గించుకుంటూ వచ్చి 2024 నాటికి లిక్కర్ షాపులు లేకుండా చేస్తామన్నారు. అంటే ప్రతి ఏటా 20 శాతం చొప్పున మూత వేసుకుంటూ మద్యం దుకాణాలు లేకుండా చేయాలి. కానీ ఇప్పటి వరకు అలా చేయలేదు. రెండు దఫాలుగా మాత్రం మూసివేతకు చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి తర్వాత దానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
టీడీపీ ప్రభుత్వంలో
సంవత్సరం ఆదాయం(కోట్లలో)
2014–15 3642
2015–16 4386
2016–17 4645
2017–18 5460
2018–19 6220
వైసీపీ ప్రభుత్వంలో
2019–20 6914
2020–21 10575
2021–22 14702
2022–23 14798
2023–24 11309