MAHAANAADU- KADAPA | పెద్ద నోట్లు రద్దే అవినీతికి విరుగుడు
ప్రధాని మోదీకి తెలుగుదేశం పార్టీ మహానాడులోసీఎం చంద్రబాబు సూచన చేశారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-27 09:28 GMT
అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కడప లో జరుగుతున్న టిడిపి మహానాడులో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన చేశారు.
దేశంలో రూ. 500, 200 నోట్ల రద్దుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఆ స్థానంలో డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా జరగడానికి మార్గం ఏర్పాటు చేయడం వల్ల అవినీతి కి అడ్డుకట్ట వేయడానికి మార్గం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కడప టిడిపి మహానాడులో మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముసాయిదా తీర్మానాలు, పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకువచ్చిన సంస్కరణలను గుర్తు చేశారు.
దేశంలో రూ. 2000, 1000 నోట్ల రద్దుతో అవినీతికి, అక్రమార్కుల ఆటలు కట్టడి చేసిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తుతించారు. అదేవిధంగా, మిగతా పెద్ద నోటను కూడా రద్దు చేస్తే మరింత మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
టిడిపి మహానాడు తీర్మానంగా తిని ప్రకటించాలని కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ చర్యలతో ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని నివారించడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి పెద్దనోట్ల రద్దు దోహదం చేస్తాయని కూడా సీఎం చంద్రబాబు చెప్పారు.
డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేకుండా పోయిందని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు తమ నిత్యావసరాలు, పార్టీలకు డిజిటల్ పేమెంట్ ల ద్వారానే విధానాలు అందుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రజల ఆలోచనలు, అవసరాలు తీర్చుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల వల్ల పేదల ప్రయోజనాలు ఏమీ లేవని ఆయన చెప్పారు.
పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహించడం, పూర్తిస్థాయి డిజిటల్లైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని సీఎం చంద్రబాబు కొన్ని సంవత్సరాలుగా గుర్తు చేస్తున్నారు.
కడప లో జరుగుతున్న టిడిపి మహానాడులో అదే అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా సూచన చేశారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ప్రతిపాదన, మహానాడులో తీర్మానంగా ప్రతిపాదించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.