RICE | కాకినాడ రేవులో దొరికిన రేషన్ బియ్యం ఎంత? కలెక్టర్ చెప్పిందెంత?

కాకినాడ రేవులో దొరికిన రేషన్ బియ్యం లెక్కలు కొలిక్కివస్తున్నాయి. డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీతో కదిలిన అధికార యంత్రాంగం రేషన్ బియ్యం లెక్క తేల్చింది.

Update: 2024-12-17 12:14 GMT
కాకినాడ రేవులో దొరికిన రేషన్ బియ్యం లెక్కలు కొలిక్కివస్తున్నాయి. డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీతో కదిలిన అధికార యంత్రాంగం రేషన్ బియ్యం లెక్క తేల్చింది. అయితే ఇది ప్రాధమిక అంచనా మాత్రమే. స్టెల్లా నౌక ద్వారా పీడీఎస్‌ బియ్యం విదేశాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో గత నెల 29న పవన్‌ కల్యాణ్‌, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, జిల్లా అధికారులతో కలిసి నౌకను పరిశీలించారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు.
కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై డిసెంబర్17న కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ మీడియా ముందుకువచ్చారు. ‘‘నవంబరు 29న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్టెల్లా షిప్‌ను పరిశీలించిన తర్వాత ఐదు విభాగాల అధికారులు బృందంగా ఏర్పడి 12గంటల పాటు శ్రమించాం. స్టెల్లా షిప్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించాం. 12శాంపిల్స్‌ సేకరించాం. షిప్‌లో దాదాపు 4వేల టన్నుల బియ్యం ఉన్నాయి. వాటిలో ప్రజాపంపిణీకి సంబంధించిన 1,320 టన్నుల బియ్యం ఉన్నట్టు నిర్ధారించాం. సత్యం బాలాజీ రైస్‌ ఇండస్ట్రీస్‌ఈ షిప్ ద్వారా బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది.

1,320 టన్నుల బియ్యాన్ని వెంటనే షిప్‌ నుంచి అన్‌లోడ్‌ చేయించి సీజ్‌ చేస్తాం. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్‌ చేయాల్సిన బియ్యం 12వేల టన్నులు ఉన్నాయి. వాటిలో ఎక్కడా పీడీఎస్‌ బియ్యం లేవని నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్‌కు అనుమతిస్తాం. కాకినాడ యాంకేజ్‌ పోర్టు, డీప్‌సీ వాటర్‌ పోర్టులో కూడా మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. ఒక్క గ్రాము పీడీఎస్‌ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటాం. షిప్‌ను ఎప్పుడు రిలీజ్‌ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. నిజాయతీగా బియ్యం వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారులు, కూలీలు భయపడాల్సిన అవసరం లేదు’’ అని కాకినాడ కలెక్టర్ స్పష్టం చేశారు.
13 సంస్థలపై కేసులు: జిల్లా ఎస్పీ
గిడ్డంగుల్లో రేషన్‌ బియ్యం అంశంపై 13 సంస్థలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రైస్‌ మిల్లులను తనిఖీ చేశారు. 89 మిల్లుల నుంచి రేషన్‌ బియ్యం సరఫరా అయినట్టు గుర్తించారు. రేషన్‌ బియ్యం కాకినాడ పోర్టుకు రాకుండా పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.
Tags:    

Similar News