కొడాలి నాని ముంబాయికి తరలింపు
మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు సమాచారం.;
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. దీంతో ఆయనకు మెరుగైన అత్యవసర వైద్య చికిత్సలు అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయనను మార్చి 31 సోమవారం ప్రత్యేక విమానంలో ముంబాయికి తరలించారు. ప్రస్తుతం కొడాలి నాని గుండెకు సబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానికి ముంబాయిలో బైపాస్ సర్జరీ నిర్వహించనున్నట్లు తెలిసింది.
కొడాలి నాని ఈ నెల 26న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తీవ్ర గుండె పోటుకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కొడాలి నానిని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఏఐజీ ఆసుపత్రిలోనే కొడాలి నాని చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. సోమవారం పరిస్థితులు కాస్త తారుమారు అయ్యాయి. కొడాలి నాని ఆరోగ్యం మీద ఏఐజీ ఆసుప్రతి వైద్యులు ఆందోళన చెందారు. కొడాలి నానికి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. కొడాలి నానికి గుండెకు సబంధించిన మూడు కవాాటాలు మూసుకు పోయాయని కొద్ది సేపటి క్రితమే విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో తెలిపారు. కొడాలి నానీకి ఎలాంటి జాప్యం లేకుండా క్రిటిక్ సర్జరీ చేయాలని వెల్లడించారు. ఇదే విషయాన్ని కొడాలి నాని కుటుంబ సభ్యులకు సూచించారు. దీని కోసం ముంబాయిలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తక్షణమే తరలించాల్సి ఉంటుందని విజ్ఞప్తి చేశారు.
దీంతో కొడాలి నాని కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబాయికి తరలించాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. కొడాలి నానితో పాటు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్య నిపుణులు కూడా ప్రత్యేక విమానంలో ముంబాయికి వెళ్లారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమై అయినప్పటికీ ఈ సారి ఎన్నికలు కొడాలి నాని చాలా సీరియస్‌గానే తీసుకున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు వరుసగా గుడివాడ నుంచి గెలుపొందిన కొడాలి నాని ఐదో సారి కూడా గెలవాలని కలలు కన్నారు. దాని కోసం తీవ్రంగా కష్ట పడ్డారు. ఇవే తన చివరి ఎన్నికలు అని, ఆ తర్వాత పోటీ చేయనని, తన వారసులు కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎవరు లేరని కూడా ఎన్నికల సమయంలో వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల కొడాలి నానితో పాటు పలువురు సీరియర్ నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరో వైపు కూటమి అధికారంలోకి రావడం, వైసీపీ నేతల మీద కేసుల పర్వం తెరపైకి రావడం, తనకు అత్యంత సన్నిహితుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ జైల్లో వేయడం వంటి అనేక పరిణామాలు కొడాలి నానిని మానసిక ఒత్తిడికి లోనయ్యేలా చేశాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని హార్ట్ స్ట్రోక్‌కు గురయ్యారనే చర్చ కూడా ఉంది.