మంచి మందు కోసం మందు బాబులు ఎదురు చూపులు

జే బ్రాండ్లతో విసిగి పోయిన బాబులు. వాటిని తాడగం తమ వల్ల కాదంటున్నారు. మంచి బ్రాండ్లు ఎప్పుడెప్పుడు వస్తాయని అల్లాడి పోతున్నారు.

Update: 2024-09-19 12:27 GMT

విజయవాడనగరంలో బెంజి సర్కిల్‌ అంటే చాలా ఫేమస్‌. విజయవాడ నగరం నుంచి బందరు వెళ్లే రోడ్డును చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి 16 క్రాస్‌ చేస్తూ వెళ్తుంది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. పీక్‌ అవర్స్‌లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. హెవీ ట్రాఫిక్‌ ఉంటుంది. రెండు ఫ్లైఓవర్లు వేసినా లక్షల సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయి. దీనికి పక్కనే లారీ అసోసియేషన్‌ కళ్యాణమండపం, దానికి పన్కన జ్యోతి కన్వెషన్‌ హాల్‌ ఉంటుంది. ఈ రెండు ఒకే లైన్‌లోనే ఉంటాయి. మహా అంటే ఆఫ్‌ ఫర్లాంగ్‌ దూరం కూడా ఉండదు. నాలుగడుగులేస్తే వచ్చేస్తుంది. ఈ గ్యాప్‌లో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. అక్కడ క్వార్టర్‌ బాటిల్‌ తీసుకోవడం బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ కింద రాళ్లపైన, చేపట్టి గోడలపైన కూర్చోవడం చుక్కేయడం మందుబాబులకు రివాజు మారింది. ఎవరి క్వార్టర్లు వాళ్లే తెచ్చుకొని మందును ప్లాస్టిక్‌ గ్లాస్‌లో వేసి నోటితో కొరికి రంద్రం చేసిన ప్యాకెట్‌లోని వాటర్‌ను అందులో కలుపి పెగ్గేస్తూ కనిపించిన ముగ్గురు మందు బాబులు ఓ చిన్న డిస్కషన్‌ పెట్టుకున్నారు. ఐదేళ్ల నుంచి ఈ మందు తాగి తాగి విసుగొచ్చింది. డబ్బులు, ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాం. తాగిన కిక్‌ ఉండటం లేదు. ఇంకా ఎన్ని రోజులు జే బ్రాండ్స్‌ తాగాలి. మంచి బ్రాండ్స్‌ ఎప్పుడొస్తాయి. అధికారం మారాలని చంద్రబాబుకు ఓటేసాం. మంచి మందు తెస్తారని గెలిపించాం. కొత్త ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా ఇంత వరకు కొత్త మందు తేలేదు. ఇంకా ఎన్ని రోజులు ఆగాలి మంచి మందు కోసమనేది వారి డిస్కషన్‌ సారాంశం.

బెంజ్‌ సర్కిల్‌ నుంచి కాస్తా ముందుకెళ్తే నిర్మలా కాన్వెంట్‌ సెంటర్‌ వస్తుంది. ఆ చౌరస్తా నంచి ఎడమ వైపు నాలుగు అడుగులు వేస్తే మరొక లిక్కర్‌ షాపు ఉంటుంది. అదీ నిత్యం రద్దీగానే ఉంటుంది. ఇద్దరు మందు బాబులు మందు కోసం వచ్చారు. ఏ బ్రాండ్‌ తీసుకుందామనేది వారి చర్చ. కొద్ది సేపు అయ్యాక షాపులోని కుర్రోణ్ణి మంచి బ్రాండ్‌లు ఏమున్నాయని అడిగితే ఇవిగో ఇవొన్నాయని ఎదురుగా ఉన్న పెట్టిన బోటిల్స్‌ చూపించాడు. ఒక్క సారిగా మందు కోసం వచ్చిన వ్యక్తికి గుండెలు జారినంత పనైంది. మంచి బ్రాండ్‌ను తీసుకొని పార్టీ చేసుకుందామని వచ్చిని వారికి అవేవీ కనబడక పోవడంతో అవన్నీ జే బ్రాండ్లేగా ఇప్పుడేమి చేయాల్రా, ఏది తీసుకుందామని తనతో పాటు వచ్చిన మరో వ్యక్తిని అడిగాడు నిరుత్సాహంగా. ఏదో ఒకటి తీసుకోరా.. ఇంకా ఎన్ని రోజులు ఈ నరకం.. మంచి బ్రాండ్లు ఎప్పుడొస్తాయో ఏంటో అని నిట్టూర్చుకుంటూ ఒక బాటిల్‌ను తీసుకొని వెళ్లి పోయారు.
ఈ వాతావరణం విజయవాడ షాపుల్లో వద్దే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మంచి బ్రాండ్ల కోసం మందు బాబులు అల్లాడి పోతున్నారు. ఈ ఐదేళ్లు ఎప్పుడు వినని బ్రాండ్లు ఈ ఐదేళ్లు విన్నారు. ఎన్నడు తాగని మందు ఈ ఐదేళ్లు తాగాము. ఇదే కంటిన్యూ అయితే జీవితం మీదే విరక్తి కలుగుతుందని, కొత్త మందు కోసం, మంచి బ్రాండ్ల కోసం ఎదురు చూస్తున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక వ్యక్తి చెప్పారు.
Tags:    

Similar News