ప్రసాదం పంపిణీపై లోకేష్‌ సీరియస్‌

భక్తుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేష్‌ అన్నారు.;

Update: 2025-01-30 04:57 GMT

శ్రీకాళహస్తి దేవాలయంలో ప్రసాదం పంపిణీపై మంత్రి నారా లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదం అందించకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని మీద తక్షణమే విచారణ జరిపించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేయని వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రస్దాం ఇవ్వడం లేదని, అలా దేవుడి ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారని ఓ భక్తుడు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్స్‌ వేదికగా ఆ భక్తుడు తన బాధను వ్యక్తం చేశాడు. శ్రీకాళహస్తి గుడి ప్రసాదం స్వాహా. లైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఉన్న సరే లేదు అని వెనక్కి పంపడం పూజారుల పని. ఆ ప్రసాదం బయటకి పంపడం సెక్యూరిటీ పని. నేను ప్రశ్నిస్తే ఉంటే ఉండు పోతే పో.. ప్రసాదం వచ్చే వరకు వెయిట్‌ చేయ్‌ అని అరవడం బాగుంది అయ్య శివయ్య అంటూ అనిల్‌ అనే భక్తుడు ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. దీనిని మంత్రి నారా లోకేష్‌కు ట్యాగ్‌ చేశాడు. ఏం పక్షాళన లేదు అంత డొల్ల అన్న అంటూ ఈ నెల 28న మెస్సేజ్‌ పెట్టాడు.
దీనిపైన మంత్రి నారా లోకేష్‌ సీరియస్‌ అయ్యారు. భక్తుల భనోభావాలను దెబ్బతీసే ఏ చర్యను కూడా ఉపేక్షించేది లేదు. ఇంకా కొంత మంది సిబ్బంది వైసీపీ ప్రభుత్వంలోని విధానాల నుంచి ఇంకా బయటకు రాలేదు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపడం మీద తక్షణమే విచారణ చేసి దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అని ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. దీనిని దేవాదాయ శాఖ మంత్రికి, అధికారులకు ట్యాగ్‌ చేశారు.
Tags:    

Similar News