మాజీ మంత్రి కాకాణి పారిపోకుండా లుకౌట్ నోటీసులు

వైసీపీ నాయకుడు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అప్రమత్తం చేశారు.;

Update: 2025-04-10 06:27 GMT
kakani Govardhan Reddy
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు వేట ముమ్మరం చేశారు. కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఎయిర్ పోర్టుల్ని అప్రమత్తం చేశారు. అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్‌ నేతృత్వంలో 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.
క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇందులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని చేర్చారు. విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటి నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.
అసలేమిటీ కేసు...
పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన కేసు ఇది. నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కు అనుమతులు ఇచ్చిందని, ఇందులో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. క్వార్ట్జ్‌ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసులను దూషించిన కేసులను కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి విదేశాలకు కలిసి రూ.250 కోట్లకుపైగా విలువ చేసే క్వార్ట్జ్‌ ఎగుమతి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలో విదేశాల నుంచి పెద్దమొత్తాల్లో నగదు బదిలీపై పూర్తిస్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలు, కొన్న వ్యక్తులు, వినియోగంపైనా దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసుల రెడ్డిపై కేసు నమోదు అయింది. ఈకేసులో వీరు ముగ్గురు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు.
తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో నెల్లూరులో గోవర్ధన్ రెడ్డి నివాసం గోడలకు నోటీసులు అంటించారు. మంత్రి కాకాణిని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పోలీసులు చెబుతున్నారు.
ఒక పోలీసు అధికారి తెలిపిన ప్రకారం, రుస్తుం మైన్స్ లో భారీ పేలుళ్లకు చట్ట ప్రకారం అనుమతిలేని పేలుడు పదార్థాలను వాడారన్నది గోవర్ధన్ రెడ్డిపై ఉన్న ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా క్వార్ట్‌జ్ ను రవాణా చేశారనేది అభియోగం. ఈ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయినా వారెవ్వరూ విచారణకు రాలేదు.గిసింది.
పరారీలో కాకాణి గోవర్ధన్ రెడ్డి...
వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి (Ex Minister) కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakanani Govardhan Reddy) ఇంకా పరారీలోనే ఉన్నారు. పదిరోజులుగా పోలీసుల (Police) నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఫిబ్రవరి 16న కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
Tags:    

Similar News