Judgment | మదనపల్లె: హత్య కేసులోె నలుగురికి జీవితఖైదు
11 ఏళ్ల విచారణ తరువాత ఏడీజే కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మరణించారు.;
మదనపల్లె రెండవ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం సంచలన తీర్పు వెలువరించారు. ఓ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు పడడం ఇదే ప్రథమం. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మరణించారు. మిగతా నలుగురు నిందితులపై కేసు విచారణ జరిగింది.
మదనపల్లెలో పూల వెంకటాచలపతిని చంపిన నలుగురికి జీవిత ఖైదీ విధిస్తూ మదనపల్లె ఏడీజే కోర్టు జడ్జి బి. అబ్రహం శుక్రవారం సంచలన తీర్పు చెప్పారు. స్థానిక చంద్రకాలనీకి చెందిన పూల వెంకటాచలపతిని 2014 ఆగష్టు 16వ తేదీ ధనేశ్వరరెడ్డి, అనుచరులు మంజు, కిషోర్, గంగాధర్, మల్లికార్జున, సురేందర్ రెడ్డి హత్యచేశారు. ఈ కేసును మదనపల్లెలో అప్పటి 2టౌన్ సిఐ గంగయ్య కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. సుమారు 11ఏళ్ళపాటు కోర్టులో కేసు విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి బీ. అబ్రహం తీర్పు చెప్పారు. నిందితులకు రూ. 20 వేలు జరిమానా కూడా విధించారు. కాగా, నిందితుల్లో ధనేశ్వరరెడ్డి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కాగా, మంజు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మిగిలిన నలుగురిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆరోగ్య పరీక్షల అనంతరం పోలీసులు జైలుకు తరలించారు.
ఈ కేసు వివరాలు ఇవి