తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు సాయంత్ర, శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారి కరుణా కటాక్షాలతో సర్వ శుభాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.