డిసెంబరులో గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Update: 2024-11-11 12:27 GMT

పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. ఆ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇది వరకే షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబరు 5వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబరు 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబరు 19న నామినేషన్‌ల పరిశీలన ఉంటుంది. నవంబరు 21న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడవు. డిసెంబరు 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నికల ఫలితాలను వెలువడనున్నాయి. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్థానం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన షేక్‌ సాబ్జీ విజయం గెలుపొందారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అకాల మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. సాబ్జీ ఓ ప్రమాదంలో మరణించారు.

Tags:    

Similar News