రేపు మందడంలో చంద్రబాబు, పవన్ బోగివేడకలు :విశేషమేమిటో తెలుసా...
రాజధాని పరిధిలోని మందడం లో రేపు పొద్దునే భోగి మంటలు వెలిగిస్తారు. పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివరాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రేపు(14.01.2024) భోగి వేడుకల్లో ఉమ్మడిగా పాల్గొననున్నారు.
గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం మందడంలో భోగి పండుగ జరుపుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ అనుకోవడంలో వెనక రాజకీయ ప్రాముఖ్యం ఉంది. మందడంలోనే 2015లో రాజధాని అమరావతినిర్మాణానికి పునాది రాయి వేశారు. రాజధానికి ఈశాన్యంగా మందడం ఉంటుంది. అంతేకాదు, ఈ గ్రామానికి ఉత్తరాన కృష్ణానది ప్రవహిస్తూఉంది. ఈ కారణాలతో చంద్రబాబు నాయుడు ఆయేడాది ఆరోతేదీన భూమి పూజ చేశారు. ఇక్కడ భోగి వేడుకలను నిర్వహించడమంటే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, వర్థిల్లుతుందనే సంకేతాలు రైతులకు, ప్రజలకు, ముఖ్యంగా అధికార పార్టీనేతలకు పంపడమే నని జనసేనే నాయకులు భావిస్తున్నారు.
ఇపుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి రాజధాని అగచాట్లుపడుతూ ఉంది. అమరావతి నుంచి రాజధానిని ఎలాగైనా విశాఖకు తరలించాలని జగన్ భావిస్తున్నారు. అయితే, అది కదలడమే లేదు. జగన్ చర్యలకు వ్యతిరేకంగా రాజధాని రైతులు హీరోచితంగా పోరాడి, కోర్టుల కెక్కి జగన్ తీసుకున్న నిర్ణయాన్న కోర్టులు కోట్టేశాల వాదించారు. విజయవంతమయ్యారు. దీనితో అమరావతి నుంచి రాజధాని కదలదని, అమరావతికి రాజధాని వైభవం వస్తుందని అనే సందేశంప్రజలందరికి పంపేందుకే మందడం గ్రామాన్ని భోగి వేడుకలకు ఎంపిక చేసినట్లు కనిపిస్తుందని తెలుగుదేశం నే నేత ఒకరు చెప్పారు.
2015 జూన్ ఆరున ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, భార్య భువనేశ్వరితో కలసి మందడం గ్రామంలో నూతన రాజధాని అమరావతికి ఉదయం 8.49 గంటలకు భూమిపూజ చేశారు.ఇందులో భాగంగా ముఖ్యమంత్రి హల యాగం (భూమిని దువ్వడం) నిర్వహించారు.