పవన్‌ కల్యాణ్‌ను కలిసిన కొత్త, మాజీ సీఎస్‌లు

ఒకే రోజు ఇరువురు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.;

Update: 2025-01-02 14:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ నూతన, మాజీ సీఎస్‌లు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కే విజయానంద్‌ గురువారం మంగళగరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గత మంగళవారం నూతన సీఎస్‌గా కే విజయానంద్‌ బాధ్యతలు స్వీకరించారు. అయితే సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ను విజయానంద్‌ కలవలేదు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజున కే విజయానంద్‌ సీఎం చంద్రబాబును కలవడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసున్న సందర్భంగా విజయానంద్‌ను పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కలిసి అభినందనలు తెలపడంతో తీరిక లేకుండా గడిపారు. దీంతో ఆ రోజు బిజీగా ఉండి పోయారు. తర్వాత రోజు నూతన సంవత్సరం రావడంతో న్యూ ఇయ్యర్‌ వేడుకల అభినందనలతో విజయానంద్‌ మరో సారి బిజీ అయ్యారు. దీంతో సీఎస్‌ కే విజయానంద్‌ గురువారం సాయంత్రం మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్లి పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆయనతో సమావేశం అయ్యారు.

Delete Edit

మరో వైపు ఇదే రోజు మాజీ ప్రభుత్వ ప్రధాన క్యాదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ కూడా పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన అక్కడ పవన్‌ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఇటీవల పదవీ విరమణ పొందారు. గత మంగళవారం వరకు సీఎస్‌గా విధులు నిర్వర్తించిన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ అదే రోజు కే విజయానంద్‌కు బాధ్యతలు అప్పగించి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్, నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌కు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఒకే రోజు ప్రస్తుత, మాజీ సీఎస్‌లు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News