ఎంజీఆర్ గురించి పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్
తనకు ఎంజీఆర్‌పై ఎంత అభిమానం ఉందో తెలిపే ట్వీట్ పవన్ కళ్యాణ్ ఈరోజు చేశారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
Byline : Vijaykumar Garika
Update: 2024-10-07 14:55 GMT
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతూనే ఉంది. తిరుపతి లడ్డూ కల్తీ, సనాతన ధర్మం అంశంలో ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇటీవల పవన్ కల్యాణ్ ఎంజీఆర్, అన్నాడీఎంకే గురించి ట్వీట్ చేయగా... ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయా అంటూ ప్రకాశ్ రాజ్ విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ క్రమంలో, పవన్ కల్యాణ్ మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేశారు.
పురచ్చి తలైవర్, ఎంజీఆర్ నుంచి పాఠాలు నేర్చుకున్నానని పవన్ వెల్లడించారు. ఈ మేరకు తాను గతంలో ఎంజీఆర్ గురించి చేసిన కామెంట్ల తాలూకు వీడియోలను పంచుకున్నారు.
ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందో అని ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే పవన్ తాజా ట్వీట్ చేసినట్టు నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనే ఎంజీఆర్ గురించి మాట్లాడానని చెప్పడమే పవన్ ఉద్దేశమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.ఎంజీఆర్ గురించి పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్