పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే సీటు దేవినేనికే?

పెనమలూరు ఎమ్మెల్యే సీటు దేవినేని ఉమామహేశ్వరావుకు దక్కే అవకాశం వుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. బోడె ప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వటం లేదని చెప్పారు.;

Byline :  The Federal
Update: 2024-03-20 14:17 GMT
Devineni Umamaheswararao

బోడె ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కె విద్యాసాగర్ పై విజయం సాధించారు. తిరిగి 2019లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేశారు. అప్పుడు వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన కె పార్థసారథిపై 11,317 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఒకసారి గెలిచినా రెండో సారి ఓడిపోయారు బోడె ప్రసాద్. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే బోడె ప్రసాద్ కు టిక్కెట్ వచ్చే ఎన్నికల్లో లేకపోవడంతో బాగా డిజప్పాయింట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ముఖ్య నాయకులు బోడె ప్రసాద్ కు టిక్కెట్ లేదని చెప్పారు. గుండె నిబ్బరం చేసుకున్న బోడె ప్రసాద్ టిక్కెట్ ఇవ్వకపోయినా నేను టీడీపీ రాజకీయాల్ల్లోనే ఉంటానని ప్రకటించారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడును మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో కలిసారు. ఈ సారికి టిక్కెట్ ఇవ్వలేమని ప్రసాద్ కు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆ తరువాత పార్టీ ఆఫీస్ నుంచి టిక్కెట్ ఇవ్వటం లేదని ఫోన్ వచ్చింది.

దేవినేని ఉమామహేశ్వరావుకు టిక్కెట్?

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు కూడా ఇంకా టిక్కెట్ కన్ఫామ్ చేయలేదు. మైలవరం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టడీపీలో చేరారు. ఆయనకు మైలవరం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం ఇచ్చి పెనమలూరు టిక్కెట్ దేవినేని ఉమామహేశ్వరావుకు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబునాయుడు ఉన్నట్లు సమాచారం. అయితే తెరపైకి చాలా పేర్లు వచ్చాయి. ఇవన్నీ వస్తే కాని మిగిలిన వారు నోరుమూసుకునే అవకాశం ఉంటుందని టీడీపీ అధిష్టానం భావించినట్లు సమాచారం. ప్రస్తుతం పూర్వపు కృష్ణా జిల్లాలో విజయవాడ ఈస్ట్, అవనిగడ్డ, లవరం, పెనమలూరు సీట్లు ఎవరికనేది ప్రకటించలేదు. బీజేపీ, జనసేన పొత్తుల కారణంగా వెంటనే టీడీపీ వారు చెప్పలేకపోతున్నారు. పైగా దేవినేని ఉమామహేశ్వరావుతో బోడె ప్రసాద్ కు విరోధం ఉంది. దాంతో వారిద్దరూ కలిసి పనిచేసుకునే అవకాశం లేదు. అయితే సీనియర్ నాయకుడు డైన దేవినేని ఉమామహేశ్వరావుకు ఎందుకు ఇంతవరకు సీటు ఇవ్వటం లేదనేది ప్రశ్నగా మారింది.

సీనియర్ నాయకుడు..

నందిగామ నుంచి 1999, 2004, ఆ తరువాత 2009,2014లో వరుసగా రెండు సార్లు మైలవరం నుంచి దేవినేని ఉమా మహేశ్వరరావు గెలిచారు. గత ఎన్నకల్లో మాత్రమే ఓటమి చవిచూశారు. అయినా ఈ సారి ఎందుకో మైలవరం సీటు ఇవ్వడం లేదు. మొదటిసారిగా 2019లో కృష్ణప్రసాద్ వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు. అంతకు ముందు కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు మూడు సార్లు నందిగామ నుంచి గెలిచారు. టీడీపీ వచ్చిన కొత్తలో టీడీపీ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఒకసారి కాంగ్రెస్, రెండు సార్లు టీడీపీ నుంచి వసంత నాగేశ్వరావు గెలుపొందారు. ప్రస్తుతం ఒకసారి గెలిచిన కృష్ణప్రసాద్ పార్టీ మారారు. దేవినేని ఉమా మహేశ్వరరావు పెనమలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాగా మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెస్ బేగ్, దేవినేని చంద్రశేఖర్రావుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నిపేర్లు వినిపించినా ఇవన్నీ పైపైకి మాత్రమేనని, పొత్తుల్లో సీట్లు పోను మిగిలిన వాటిల్లో ఎవరెవరిని ఉంచాలో ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించుకుని ఉన్నారని సమాచారం. పెనమలూరు నుంచి ఖచ్చితంగా దేవినేని ఉమా మహేశ్వరరావు రంగంలోకి దిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News