బెట్టింగ్ రాయుళ్లకు ఏపీ ఎన్నికల ఝలక్.. అంతా పోయిందిగా..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతో మండిని నట్టేట ముంచేశాయి. టీడీపీ గెలుపు చాలా మంది ఆత్మహత్యలకు కూడా కారణమయినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల బరిలో భీకర పోరే జరిగింది

Update: 2024-06-06 10:41 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతో మండిని నట్టేట ముంచేశాయి. టీడీపీ గెలుపు చాలా మంది ఆత్మహత్యలకు కూడా కారణమయినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల బరిలో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య భీకర పోరే జరిగింది. కౌంటింగ్‌కు ముందు రోజు కూడా వైసీపీ శ్రేణులు, నేతలు అందరూ కూడా విజయం తమనే వరిస్తుందన్న పూర్తి ధీమాతో ఉన్నారు. అదే నిజమవుతుందని కూడా నమ్మారు. కానీ కౌంటింగ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే విజయం తమకు దూరంగా జరగడాన్ని వైసీపీ అభ్యర్థులు గమనించారు. వీరితో పాటు ఇదే విషయాన్ని ఈ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లు వేసిన వారు కూడా పసిగట్టేశారు. వాళ్లు ఎంత పెద్ద తప్పు చేశారు అన్నది వాళ్లకి ఆ క్షణాన అవగతమైంది.

ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడం, వైసీసీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో వైసీపీపై బెట్టింగ్ కాసిన వాళ్లందరి ముఖాలు శరీరంలో నెత్తుటి చుక్క లేనట్లు పాలియాయి. అందుకు కారణం.. వాళ్లు బెట్టింగ్ వేసింది ఏ పదో పరకో కాదు. లక్షల రూపాయాలు. తమ దగ్గర లేకుంటే అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టారు. ఆ డబ్బంతా ఇప్పుడు పోవడంతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు అప్పుల బాధలు తట్టుకోలేక పరారవుతున్నారు. ఇందుకు కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బిక్కిన సురేష్ నిదర్శనం. 30ఏళ్ల సురేష్.. వైసీపీనే గెలుస్తుందని రూ.30లక్షల బెట్టింగ్ కాశాడు. ఇప్పుడు ఆ మొత్తం పోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పల్నాడు జిల్లాలో పందెం డబ్బుతో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తం పరారయ్యాడు. ఎన్నికల నేపథ్యంలో భారీగా పందేలు జరుగుతున్న క్రమంలోనే.. పర్సంటేజీలతో మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ కొందరు పందేలాను నిర్వహిస్తున్నారు. అదే విధంగా పల్నాడు జిల్లా రొంపిచర్ల చెరువు కట్ట సెంటర్లో ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉండి ఎన్నికల పందెం వేయించారు. పందెం సొమ్ము రూ.1.50 కోట్ల తన దగ్గర పెట్టుకున్నాడు. తీరా చూస్తే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి ఆ మధ్యవర్తి వ్యక్తి కనిపించడం లేదు. తీరా అతడు డబ్బుతో ఉడాయించాడని తెలియడంతో పందెం కాసిన ఇద్దరూ బావురుమంటున్నారు.

గుంటూరులో కూడా ఇదే విధంగా వైసీపీపై సుమారు రూ.50 లక్షల పందెం కాసిన ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడు. కానీ అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు చెప్తున్నారు. దీంతో అతడికి అప్పు ఇచ్చిన వారు అందులో ఎంత నిజముంది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అనంతపురం జిల్లా చుక్కరాయసముద్రం మండటం రేగడికొత్తూరుకు చెందిన వైసీపీ నేత కూడా సందెం డబ్బులతో పారిపోయినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు, అల్లరలు ఇలా మరెన్నో జరగకుండా కఠిన చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం.. బెట్టింగ్‌లను ఎందుకు విస్మరించిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు ఈసీకి తెలియదా? లేకుంటే ఎన్నికల ప్రచారం సమయంలో ఫిర్యాదు వస్తేనే స్పందిస్తాం అన్న రీతిలో వ్యవహరించినట్లే ఈ విషయంలో కూడా ఫిర్యాదు రాలేదు కదా అని ఆగిపోయిందా? అని కూడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇంత స్థాయిలో బెట్టింగ్‌లు జరుగుతుంటే పోలీసులకు కూడా తెలియలేదా అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News