తొలిసారి ఎంట్రీ ఇస్తున్న రాజకీయ వారసులు

రాజకీయాల్లో వారసులు వచ్చేస్తున్నారు. తండ్రులు, భర్తలు, భార్యలు, మామలు ఇలా రాజకీయ వారసులుగా ఆటరంగ్రేటం చేసేందుకు సిద్ధమయ్యారు.

Update: 2024-02-26 08:29 GMT
tdp flog

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన 94 మంది అభ్యర్థుల తొలి జాబితాలో వీరికి చోటు దక్కడం విశేషం.

యనమల దివ్య: ఈమెకు తుని స్థానం కేటాయించారు. ఈమె తండ్రి యనమల రామకృష్ణుడు. టిడిపి సీనియర్‌ నేతల్లో ఒకరు. ఆర్థిక శాఖ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా ఉమ్మడి రాష్ట్రంలోను, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోను పని చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఇతను ఒకరు.
కొండపల్లి శ్రీనివాస్‌: గజపతినగరం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ఎంపి కొండపల్లి పైడితల్లినాయుడు మనుమడు. ఇతని తండ్రి కొండపల్లి కొండలరావు. ఇతను సీనియర్‌ రాజకీయ నేత. గతంలో గంట్యాడ ఎంపిపిగా పని చేశారు. ఇతని పిన తండ్రి అప్పలనాయుడు కూడా సీనియర్‌ టిడిపి నేత. మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం గజపతినగరం నియోజక వర్గం టిడిపి ఇన్‌చార్జిగా ఉన్నారు.
రెడ్డప్పగారి మాధవి: ఈమె కడప అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఈమె భర్త సీనియర్‌ టిడిపి నేత. ప్రస్తుతం టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఈమె మామ రెడ్డప్పగారి రాజగోపాల్‌ రెడ్డి కూడా సీనియర్‌ రాజకీయ నేత. గతంలో మంత్రిగా పని చేశారు. వీరి వారసురాలుగా బెర్తు దక్కించుకున్న మాధవి తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలువనున్నారు.
ఆదిరెడ్డి వాసు: చంద్రబాబు విడుదల చేసిన తొలి జాబితాలో చోటు దక్కింది. రాజమండ్రి సిటీ స్థానం కేటాయించారు. ఇతని తండ్రి, భార్య కూడా టిడిపి నేతలే. ఎమ్మెల్యేగాను, ఎమ్మెల్సీగాను పని చేశారు. తండ్రి ఆదిరెడ్డి అప్పారావు. ఇతను ఎమ్మెల్సీగా పని చేశారు. ఈయన భార్య ఆదిరెడ్డి భవానీ. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.
టిడిపి ఎమ్మెల్యేల్లో ఏకైక మహిళా ఎమ్మెల్యే. ఈమె తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు. చంద్రబాబుకు అ్యంత సన్నిహితుల్లో ఒకరు. ఎర్రన్నాయుడు మరణానంతరం అతని కుమారుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపిగా ఉన్నారు. రామ్మోహన్‌ నాయుడు చిన్నాన్న కింజరాపు అచ్చెన్నాయుడు. ఈయన టిడిపిలో సీనియర్‌ నేత. ప్రస్తుతం టీడీపీ ఏపీ అధ్యక్షుడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఇంత మంది రాజకీయ వారసత్వంతో ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి టిడిపి అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు.
వర్ల కుమార్‌రాజా: ఇతను పామర్రు టికెట్‌ దక్కించుకున్నారు. టిడిపి సీనియర్‌ నేతల్లో ఒకరైన వర్ల రామయ్య కుమారుడు. వర్ల రామయ్య చంద్రబాబుకు సన్నిహితుడు. 2014లో పామర్రు నుంచి వర్ల రామయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి అతని కుమారు వర్ల కుమార్‌రాజాకు అవకాశం కల్పించారు.
నెలవల విజయశ్రీ: ఈమెకు సూళ్లూరు పేటలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఈమె తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం. ఇతను గతంలో ఎమ్మెల్యేగాను, ఎంపిగాను పని చేశారు. ఇతని వారసురాలుగా తొలి సారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీలో నిలవనున్నారు.
ఎంఇ సునీల్‌ కుమార్‌: మడకసిర నుంచి ఇతను టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇతను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు. ఈరన్న అనంతపురం జిల్లా సీనియర్‌ రాజకీయ నేతల్లో ఒకరు. సునీల్‌ కుమార్‌కే ఈ స్థానం కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరిగింది. ఆ మేరకు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఈరన్న వారసుడిగా ఈ సారి ఎన్నికల బరిలో నిలవనున్నారు.
ఎస్‌ సునీత: ఈమెకు పెనుగొండ స్థానం చంద్రబాబు కేటాయించారు. ఈమె తండ్రి రామచంద్రారెడ్డి, సీనియర్‌ పొలిటీషియన్‌. గతంలో మంత్రిగా, ఎంపిగా కూడా పని చేశారు. వీరి వారసురాలుగా ఈ సారి ఎన్నికల్లో ఆరంగేట్రం చేయనున్నారు.
బడేటి రాధాకృష్ణ: ఇతనికి ఏలూరు స్థానం కేటాయించారు. ఇతను కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వాచ్చారు. మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు సోదరుడు. ఆయన మరణానంతరం రాజకీయ వారసత్వం తీసుకున్నారు. ఏలూరు టిడిపి ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు.
Tags:    

Similar News