మళ్లీ రిమాండ్ కు పోసాని
రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో పోసానిని పోలీసులు అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారు.;
నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. నాపైన అక్రమ కేసులు పెట్టారు. ఒకే విధమైన కేసులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాపై కేసులు పెట్టారు. అందులో భాగంగా నన్ను రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు. నాకు ఆరోగ్యం బాగలేదు. గుండె జబ్బు, పక్షవాతం, బీపీ వంటి రుగ్మతలతో సతమతమవుతున్నాను. దయచేసి నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని నా పై నమోదు చేసిన అక్రమ కేసులను కొట్టి వేయాలని కోరుతున్నా. అంటూ విజయవాడ కోర్టులో శనివారం పోసాని కృష్ణమురళి న్యాయాధికారిని కోరారు. కానీ పోసాని విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. మరో వైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో చుక్కెదురైంది. రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతులు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. బెయిల్ పిటీషన్‌ను సోమవారానికి వాయిదా వేసింది.