గెలుపు ధీమాలో పురందేశ్వరి
గెలుపు ధీమాలో పురందేశ్వరి
రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి గెలుపు ధీమాలో ఉన్నారు. ఎన్నికలు ముగియగానే ఆమె తన అనుచరులతో రాజమహేంద్రవరంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మెజారిటీ ఎంత రవొచ్చనే లెక్కలు వేశారు. సుమారు లక్ష ఓట్ల మెజారిటీ రావచ్చనే ధీమాను వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి బిజెపి, టిడిపి, జనసేన కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి రగంలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మొదటిసారిగా ఎన్నికల రంగంలోకి దిగారు. ఈయన రాజమహేంద్రవరంలో పేరున్న డాక్టర్. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మార్గాని భరత్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టిక్కెట్ కాకుండా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే టిక్కెట్ వైఎస్సార్‌సీపీ ఇచ్చింది. గతంలో వైఎస్సార్‌సీపీ సిటీ కో ఆర్డినేటర్‌గా ఉన్న గూడూరి శ్రీనివాసులును ఎంపిగా రంగంలోకి దించింది. కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా తన బలాన్ని నిరూపించుకోవాలనే ఆలోచనతో బాగానే క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ అభిమానుల ఓట్లు తప్పకుండా ఆయనకు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఓట్లు వైఎస్సార్‌సీపీ నుంచి చీలే అవకాశాలు కూడా లేకపోలేదని స్థానికులు చెప్పారు.