‘నన్ను టార్చర్ చేశారు’.. ఏస్పీకి రఘురామ ఫిర్యాదు..
వైసీపీ హయాంలో తనపై నమోదైనా కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. గుంటూరు జిల్లా ఎస్పీకి ఈరోజు ఫిర్యాదు చేశారు.
వైసీపీ హయాంలో తనపై నమోదైనా కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. గుంటూరు జిల్లా ఎస్పీకి ఈరోజు ఫిర్యాదు చేశారు. తనను ఆ సమయంలో కస్టడిలో తీవ్రాతి తీవ్రంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో తనపై దాడి జరిగిందని కోర్టుకు విన్నవించుకున్నా.. అడిషినల్ ఎస్పీ విజయ్ పాల్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి కలిసి న్యాయస్థానానికి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా అప్పటి సీఎం జగన్‌మోహన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తామని ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ బెదిరించారని పేర్కొన్నారు రఘురామ. ఈ నేపథ్యంలోనే తనపై జరిగిన హత్యాయత్నం, కస్టడీ టార్చర్, క్రిమినల్ కుట్రకు సంబంధించి ఫిర్యాదు చేస్తున్నానని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన తన ఫిర్యాదులో సంఘటనకు సంబంధించిన వివరాలు, కేసుకు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్, చట్టపరమైన ప్రొవిజన్స్, మెడికల్ సాక్ష్యాలు, పలు కుట్రపూరితమైన ఆరోపణలను కూడా ఆయన వివరించారు.