కర్నూలులో రాయలసీమ ‘రవ్వలసడి’ విడుదల

రాయలసీమ సాహిత్య ఉద్యమ నేపథ్యాన్ని, వర్తమాన రాయలసీమ సాహిత్యస్థితిని విశదీకరించే పుస్తకం ‘రవ్వల సడి’ ఆవిష్కరణ

Update: 2024-10-06 12:05 GMT


రాయలసీమ సాహిత్యంలో అధునిక కవిత్వ నడకలను చెబుతూ పరిశోధనాత్మకంగా సాగిన అరుదైన గ్రంథం ‘రవ్వలసడి’ అని ప్రముఖ రచయిత్రి డా.కెసుభాషిణి అన్నారు.  కర్నూలు నగరంలోని లలితకళాసమితిలో ఆదివారం ఉదయం ‘కవిసమ్మేళనం’ సాహిత్య వేదిక అధ్వర్యంలో ప్రముఖకవి జి.వెంకటకృష్ణ రాసిన రవ్వలసడి పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు.

కవిత్వంలో లోతైన విషయాలు చర్చించారని అయితే ఆధునిక కవిత్వంలో గొప్ప కవిత్వం సృష్టించిన వెంకటకృష్ణ కవిత్వ పరిచయం లేకపోవడం వెలితిగా భావిస్తున్నానన్నారు. ఈ గ్రంథం పరిశోధకులకు అరుదైనదని, ఇది అకాడమిక్‌ గా ఎంతగానో ఉపయోగపడ్తుందని డా. సుభాషిణి అన్నారు.



 సభాధ్యక్షత వహించిన సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ పంజాబి కవి చెప్పినట్లు ‘మనమేం గాజు గ్లాసులమా, కిందపడితే పగిలిపోడానికి..మనకు మనం పునర్నిర్మించుకొవలసిన వాళ్ళమని చరిత్ర గమనంలో పొందుతున్న రాజకీయ చైతన్యంతో కవులైనవాళ్ళమ’ని అలాంటి కవుల గూర్చి ఈ గ్రంథంలో ఉండటం విశేషమన్నారు. రాయలసీమ ఆధునిక కవిత్వ పరిచయం పేరుతో వెంకటకృష్ణ గారు తీసుకొచ్చిన ఈ రవ్వల సడి రాయలసీమ సాహిత్య ఉద్యమ నేపథ్యాన్ని ..వర్తమాన రాయలసీమ సాహిత్యస్థితిని విశదీకరిస్తుందని మోహన్ అ న్నారు.


పుస్తకసమీక్షులుగా హాజరైన కవి, పరిశోధకలు డా.అంకె శ్రీనివాస్‌ మాట్లాడుతూ 45 వ్యాసాలు`275 పుటల ఈ గ్రంథం అయినప్పటికీ ఇది సమగ్రమూ అని చెప్పడానికి సాహసించడం లేదనిపరిధి, పరిమితి, తనకున్న సమయంలో చర్చించిన సంగతులే కవిత్వ వ్యాసంగా మొలిచాయని అన్నారు. 1956 నుండి నేటి వరకు కొంతమేరకు మూల్యాంకనం చేయగలిగారన్నారు. జి.వెంకటకృష్ణగారు రాసిన వ్యాసాల్లో ఈ కవి సమగ్ర సాహిత్య జీవితాన్ని చెప్పారు.

సభకు హాజరైన ‘కవిసమ్మేళనం’ ప్రచురణకర్త కొత్తపల్లి సురేష్‌ మాట్లాడుతూ తమ ప్రచురణలు తీసుకొస్తున్న మొదటి గ్రంథమని, శ్రీనివాసం పేరుతో మరో గ్రంథం రాబోతుందన్నారు. నిరంతరం సాహిత్య కార్యాక్రమాలను విస్తృతపరుస్తామన్నాని చెబుతూ వెంకటకృష్ణ తన స్పందనను తెలుపుతూ ఈ గ్రంథం సమగ్రమూల్యాంకనంగా తాము భావించడం లేదని మరింత లోతుగా విస్మరించిన సంగతులతో రావాల్సిన అవసరముందన్నారు.
సభను సాహితీస్రవంతి జిల్లా ప్రధానకార్యదర్శి ఆవుల చక్రపాణియాదవ్‌ ప్రారంభించగా చైతన్యగీతాలను కళాకారులు మహమ్మద్‌ మియా యంపి బసవరాజులు ఆలపించారు. సభలో కవులు రచయితలు సాహిత్యాభిమానులు చౌశా, మారుతీపౌరోహితం, ఇనాయతుల్లా, డి.పార్వతయ్య, ఏవిరెడ్డి, రాంసుబ్బారెడ్డి, సిఐ శ్రీనాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News