షర్మిలతో కాంగ్రెస్ కండువా కప్పించుకున్న ఆర్‌కే
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. బాధ్యతల స్వీకరణ సందర్బంగా పార్టీలో చేర్చుకున్నారు.;
Byline : The Federal
Update: 2024-01-21 10:35 GMT
మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తరువాత ఆహ్వానం కళ్యాణ మండపంలో వేదిక వద్ద కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి షర్మిల రామకృష్ణారెడ్డిని ఆహ్వానించారు. ఈ సదర్భంలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేస్తూ మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా గంజి చిరంజీవిని నియమించారు. ఈ నియామకానికి ఒకరోజు ముందు రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యేగా ఆర్‌కే చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. స్పీకర్ ఆమోదించినా ఆమోదించకపోయినా నేను రాజీనామా చేశానని ఆళ్ల అప్పట్లో చెప్పారు.
నిధులు ఇవ్వకుండా, నియోజకవర్గంలో అభివృద్ధిలేకుండా సీఎం చేశారని, అందుకే పార్టీని వీడినట్లు చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల సమక్షంలో చేరుతానని అప్పట్లో ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారం వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకోగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు.