రోజా జబర్దస్త్‌ దోపిడీ...

మంత్రి రోజా జబర్దస్త్‌గా దోపిడీకి పాల్పడుతోంది. ఒకప్పుడు ఐరన్‌లెగ్‌ ఇప్పుడు మంత్రి అయింది. భర్త, అన్నలతో కలిసి ఎదేశ్చగా నగరిలో దోచుకుంటోంది: షర్మిల;

Update: 2024-02-12 10:10 GMT
APCC Chief YS Sharmila

ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల వైసీపీ మంత్రి రోజాను ఉతికి ఆరేసింది. జబర్దస్త్‌ గా దోపిడీకి పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు అన్న ప్రభుత్వంపై విమర్శలు సందిస్తున్న షర్మిల స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై విరుచుపడుతున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనియాంశంగా మారింది. మంత్రి రోజా ప్రత్యేకించి మీడియాతో మాట్లాడిన మాటలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. ఆదివారం నగరి పర్యటనలో రోజా పనితీరును తూర్పారబట్టారు. నీబాగోతం ఏమిటో చెన్నైలో తెలుస్తుంది అంటూ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రోజాకు చురకత్తుల్లా గుచ్చుకుంటున్నాయి.

రాజశేఖర్‌రెడ్డిని పంచ ఊడదీసి కొట్టాలన్నప్పుడు నీ ఇంగితం ఏమైంది?
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంత పెద్ద మనిషిని పట్టుకుని పంచ ఊడదీసి కొట్టాలని తెలుగుదేశం పార్టీలో ఉండగా అన్నావే, అప్పుడు మీకు మేము గుర్తుకు రాలేదా నీ ఇంగితం ఏమైంది అంటూ ప్రశ్నించారు. నేను కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌టీపీని విలీనం చేశాను. పార్టీని మూసేయలేదు. కాంగ్రెస్‌లో నేను ఉన్నంతకాలం వైఎస్సార్‌టీపీ ఉంటుందని గుర్తుచేశారు. నీలాగా జబర్దస్త్‌ దోపిడీ చేయడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో నిన్ను ఐరన్‌లెగ్‌ అంటూ పిలిచేవారు. అందుకు ఎవరినంటే వారిని నీ ఇష్టం వచ్చినట్లు తిట్టావు అవన్నీ గుర్తు పెట్టుకో అంటూ హెచ్చరించారు.
జబర్దస్త్‌ దోపిడీ అట..
వస్తూ వస్తూ ఎవరు మీ ఎమ్మెల్యే, ఎలా పనిచేస్తున్నారని ఒక అన్నను అడిగా. అంటే నాతో చెప్పిన వాళ్లు అమ్మా జబర్దస్త్‌ దోపిడీ. జబర్దస్త్‌గా దోచుకుంటున్నారన్నారు. పోనీ ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు. ఒకరు కాదమ్మా మంత్రులు నలుగురున్నారు. రోజా ఒక మంత్రి, భర్త, వాళ్ల అన్నలు ఇద్దరూ మంత్రులేనట. జబర్దస్త్‌గా దోచుకుంటున్నారట. గ్రావెల్, చెరువు మట్టి, ఇసుక వదలరట. పేదవాళ్ల కోసం హౌసింగ్‌ కడితే ఆ హౌసింగ్‌ మాఫియాతో కలిసి పేదవాళ్ల డబ్బు నుంచి వందల కోట్లు దోచుకున్నారమ్మా అన్నారు. ఉద్యోగాల కోసం వస్తే డబ్బులు, ఎవరైనా వెంచర్లు వేస్తే వెంచర్లలో వీళ్లకు ప్లాట్లు ఇవ్వాలి. లేదా కప్పమైనా కట్టాలి. వీళ్ల కన్ను పడిందీ అంటే ఆ ప్లాట్లు మిగలవమ్మా అన్నారు. ఇందుకేనా అధికారం ఇచ్చింది. ఇందుకేనా ఓట్లేసింది. ఎక్కడ చూసినా అవినీతే ప్రజల గురించి ఆలోచన చేసే వారులేరు అంటూ రోజాపై మండిపడ్డారు షర్మిల.
Tags:    

Similar News