‘‘ఆ… కోటలో రాణి ఎవరో..?!

చారిత్రక ప్రదేశంలో ఇద్దరు ఒకే సామాజిక వర్గం మహిళలే పోటీపడుతున్నారు. పెనుగొండ కోటలో జెండా ఎవరు ఎగరేస్తారనేది ఆసక్తిగా మారింది.

Update: 2024-04-06 12:50 GMT
పెనుగొండ రాజకీయ సమరం

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: చారిత్రిక నేపథ్యం కలిగిన ప్రదేశం. రాజులేలిన గడ్డ కూడా. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు బీసీ మహిళల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. వారిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళలు. ఇద్దరిదీ ప్రేమ వివాహమే. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అండతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పోటీకి దిగారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు మహిళలు పోటీపడుతున్న ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి నిలిచింది. టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎన్నికల్లో మొదటిసారి అధికార వైఎస్ఆర్సిపి గెలిచింది. 2024 ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని వైఎస్ఆర్సిపి పోరాడుతుంది. పూర్వ వైభవం సాధించుకునే దిశగా టీడీపీ శ్రమిస్తోంది. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం ఎలా ఉందంటే.

బీసీల అడ్డా..

పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల, పరిగి పెనుగొండ, సోమందేపల్లి మండలాల్లో 2,33,682 ఓటర్లు ఉన్నారు. వారిలో 1,17,310 మంది పురుషులు. 1.16,369 మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం మొత్తంలో.. బోయ సామాజిక వర్గం నుంచి 35 నుంచి 40 వేలు, పూర్వ సామాజిక వర్గం నుంచి 30 నుంచి 35 వేలు, ఎస్‌ఎస్‌సిలు 25 నుంచి 30 వేల వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బలహీన వర్గాలకు అడ్డాగా ఉన్న పెనుగొండ నియోజకవర్గంలో కొంతకాలం వరకు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ఎమ్మెల్యేలుగా ఆదిపత్యం కొనసాగించాయి. 1952లో ఏర్పాటు అయిన పెనుగొండ నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు, టిడిపి 8, వైఎస్ఆర్సిపి ఒకసారి, గతంలో స్వతంత్రులు కూడా ఇద్దరూ గెలుపొందారు.

ప్రచారంలో టిడిపి అభ్యర్థి సవిత(ఫైల్ ఫొటో)

టిడిపికి కంచుకోట

అనంతపురం జిల్లాలో 1994 నుంచి రాజకీయంగా పెనుగొండ నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా ఉంది. 2008 వరకు పరిటాల రవి, ఆయన కుటుంబం ఇక్కడ రాజకీయంగా ఆధిపత్యం కొనసాగింది. హత్యానంతరం పరిటాల రవి హత్య అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తన భార్య పరిటాల సునీత నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.2014 ఎన్నికల్లో అభ్యర్థిగా బీకే పార్థసారథి 17 ఓట్ల మెజారిటీతో ఏం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి శంకర్ నారాయణ చెతిలో బీకే పార్థసారథి ఓటమి చెందారు. తమ సర్వేలో పనితీరు బాగాలేదని నెపంతో సిటీకి ఎమ్మెల్యే శంకర్ నారాయణ కు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. బీకే పార్థసారథి కూడా టికెట్ దక్కలేదు. పార్థసారథి తిరుగుబాటు చేసి ప్రచార సామాగ్రిని కూడా దహనం చేశారు. అసమ్మతి మరింత పెరగకుండా నష్ట నివారణ చర్ల కోసం బీకే పార్థసారథిని హిందూపురం పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ ఎన్. చంద్రబాబు నాయుడు ప్రశాంతం చేశారు. సర్వేలో పనితీరు బాగాలేదు అంటూనే... మంత్రి ఉష శ్రీ చరణ్‌ను పెనుగొండ స్థానానికి బదిలీపై తీసుకువచ్చారు. ఈ మార్పుల వల్ల..

మహిళల మధ్య సమరం


పెనుగొండ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఇద్దరు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు పోటీకి సిద్ధమయ్యారు. వారిలో టీడీపీ నుంచి రాజకీయ వారసురాలిగా వచ్చిన ఎస్ రామచంద్ర కుమార్తె ఎస్. సవిత పోటీ చేస్తున్నారు. ఈమెపై కళ్యాణదుర్గం నుంచి బదిలీపై వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తున్నారు.

సామాజిక కార్యక్రమాలతో...

టిడిపి అభ్యర్థి సవిత తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఆమె బాధ్యత నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఎన్.‌ఆర్‌ఆర్ ట్రస్టు ద్వారా సామాజిక కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. అందులో ప్రధానంగా అన్నా క్యాంటీన్ నిర్వహణ, వాల్మీకి, కనకదాస, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు తోడ్పాటు అందించారు. టిడిపి కార్యకర్తలే కాకుండా పేదల పిల్లల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పౌష్టికాహారం, ముస్లింలకు తోఫా అందించడం వంటి కార్యక్రమాలతో జనంతో మమేకమయ్యారు. కడప జిల్లా రాజంపేట సమీపంలోని అన్నమయ్య ప్రాజెక్టు వరద నీటి కొట్టుకుపోవడంతో నిర్వాసితులైన వందలాది మంది ప్రజలకు ట్రస్టు ద్వారా మొదట ఆమె ఆర్థిక సహాయం అందించారు.

ప్లస్ పాయింట్:

నియోజకవర్గంలో ఈమెకు అసమ్మతి సెగలు లేకపోవడం. రాజకీయ కుటుంబం కావడం. సామాజిక కార్యక్రమాలతో జనంలో ఉండడం. మేనిఫెస్టో: పార్టీ మేనిఫెస్టో కాకుండా, పెనుగొండ నియోజకవర్గంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, మహిళల కోసం ఆమె ప్రత్యేకంగా తన అజెండా ప్రకటించడం ఇక్కడ ప్రత్యేకం. ద్వారా ప్రజలను ఆకట్టుకునేందుకు ఆమె ముందు చూపిస్తున్న వ్యవహరించాలని పరిస్థితి ఇక్కడ చెప్పకనే చెబుతుంది.


రాజకీయ బదిలీపై...

పెనుగొండ నియోజకవర్గానికి మంత్రి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీ చరణ్‌ను బదిలీపై తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈమెపై అనేక అవినీతి ఆరోపణలు కూడా లేకపోలేదు. అలాంటి వ్యక్తిని తీసుకురావడం ఏంటి అని వైయస్సార్సీపి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని బాహాటంగా కూడా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు కూడా చేశారు. ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ కు టికెట్ మళ్లీ ఇవ్వకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకునే దిశగా అడుగులు వేయడానికి ఉషశ్రీ చరణ్ చొరవ చూపలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆ పార్టీ రాయలసీమ ఇంచార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం. పెనుగొండ నియోజకవర్గంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం కుదర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కార్యకర్తలు నాయకులతో పెనుగొండ అభ్యర్థి చొరవగా వెళ్లడం లేదని చెబుతున్నారు.

బలం, బలహీనత:

నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఉషశ్రీ చరణ్‌కు ఉన్న బలం బలహీనతలపై సమీక్ష జరుగుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే నాయకులు, అభిమానులు శ్రేణులు ఆ పార్టీకి ఈ నియోజకవర్గంలో బలమని భావిస్తున్నారు. కళ్యాణం దుర్గం నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాయకురాలు పెనుగొండలో ఏం చేస్తారో అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అందరినీ కలుపుకోకపోవడం కూడా ప్రధాన సమస్య అనేది ప్రస్తావిస్తున్నారు.

ఎమ్మెల్యేలకు ఆత్మ రక్షణ సమస్య

రాజకీయ పరిస్థితి, ప్రభావం, నేపథ్యాన్ని కాస్త వెనకటి రోజులకు వెళ్లి పరిశీలిస్తే ఒళ్ళు గబురు పొడుస్తుంది. ప్రధాన కారణం.. పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలకు ఆత్మ రక్షణ సమస్యగా మారినట్లు జరిగిన సంఘటనలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. కోవలో.. పెనుగొండ నుంచి 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నారెడ్డి హత్యకు గురయ్యారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్వీ రమణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తన పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యర్థులు ఆయనను హత్య చేశారు.

ఆ తర్వాత పెనుగొండ ఎమ్మెల్యేగా పరిటాల రవి వ్యక్తిత్వం రాజకీయ నేపథ్యం విభిన్నమైనది. ప్రత్యర్థులకు శత్రువుగా మారిన పరిటాల రవి పేదల పాలిట దైవంగా అభిమాన సంపాదించుకున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎన్టీ. రామారావు, ఎన్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రవి 2005 జనవరి నెలలో అనంతపురం డిపి కార్యాలయ ఆవరణలో హత్యకు గురయ్యారు. ప్రస్తుత పెనుగొండ సిటీ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై కూడా గత ఏడాది గ్రనేడ్ దాడి జరిగింది. అందరి పరిస్థితి ఇలా ఉంటే పెనుగొండ నియోజకవర్గంలో.. జనం ప్రత్యేకంగా రైతులు తల్లడిల్లుతున్నారు.

సాగునీరేది...

గత తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో పెనుగొండ సమీపంలో కియా పరిశ్రమ రావడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని గుర్తు చేస్తున్నారు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన పెనుగొండ ప్రాంతానికి కృష్ణా జలాలను గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి తరలించి, చెరువులు నింపడం వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. కొన్నేళ్లుగా కృష్ణా జలాలు ప్రవహించిన స్థితిలో చెరువులు ఎండిపోయాయి.

రిజర్వాయర్లు ఎండిపోయాయి. దీనివల్ల ఒక పంట పండడమే కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. తాగు నీరు లేక అల్లాడుతున్నామని, గత్యంతరం లేని స్థితిలో మళ్లీ వలసలు పెరిగాయని ఆ ప్రాంత ప్రజలు గుర్తు చేస్తున్నారు. దీనిని టిడిపి ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న అధికార వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్, టిడిపి అభ్యర్థి ఎస్ సవిత పట్టు సాధించాలని పోరాటంలోకి దిగారు. తాగు, తాగునీరు, ఉపాధి అవకాశాలు ఇక నిరుద్యోగులు రైతులు ఇబ్బంది పడుతున్నారు.



Tags:    

Similar News