ఆంధ్రాలో రహస్య రాజకీయాలు...
నాలుగు పార్టీల మధ్య దోబూచులాట జరుగుతోంది. ఎన్నికల నాటికి ఎవరితో ఎవరితో జతకడతారో క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఈ చదరంగం ఆట కొనసాగుతూనే ఉంటుంది.;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంతకుముందెన్నడూ జరగని రహాస్యాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల మధ్య పొత్తులు, కసరత్తులు ముమ్మరమయ్యాయి. వైఎస్సార్‌సీపీ మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లో పోటీకి దిగనున్నది.
తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తుతో ఎన్నికల్లో పోటీకి దిగాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రా కదిలిరా పేరుతో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత ఇప్పటికే జనం మధ్యకు వచ్చారు. జనసేన, టీడీపీ ఉమ్మడి సభలకు ప్లాన్ జరుగుతోంది. అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తే ఉమ్మడి సభల షురూ.. పెరుగుతుంది.
తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి ఇన్‌డైరెక్టుగా మద్దతిస్తున్నట్టే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇన్‌డైరెక్టుగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు టీడీపీ కృషి చేసింది. ప్రస్తుతం జనసేన జాతీయ స్థాయిలో ఎన్‌డీఏ కూటమిలో ఉంది. రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తోంది. బీజేపీతో కలిసి పనిచేసేందుకు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంగీకరించడం లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది. బీజేపీని ఎలాగైనా టీడీపీ, జనసేన కూటమిలో చేర్చాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శతవిధాల ప్రయతిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఫలిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.
టీడీపీ, జనసేన
జనసేన, బీజేపీ
కాంగ్రెస్, టీడీపీ
ఈ పార్టీల మధ్య రహస్య భేటీలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నాలుగు పార్టీల రాజకీయ చదరంగం ఎటువంటి పరిణామాలాకు దారితీస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కలవాలనే ప్రయత్నం ఫలిస్తుందా? లేదా? అనే దానిపై ఆయా పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరుకు పార్టీల పొత్తులు, ఎత్తులు పూర్తయ్యే అవకాశం ఉంది.