షర్మిల మార్క్‌ కాంగ్రెస్‌

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో వైెస్ షర్మిల మార్కు ఉందని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ప్రత్యేక ప్రయారిటీ ఇచ్చింది.

Update: 2024-04-02 13:33 GMT
వైెస్ షర్మిల

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు సమర్థులైన వారు ఉన్నారని పలువురు అంటున్నారు. కాంగ్రెస్‌ను రాష్ట్రంలోని ప్రజలు తిరస్కరించినా నాయకులు మాత్రం చాలా తక్కువ మంది తిరస్కరించలేదు. సీనియర్‌ నాయకులు పార్టీని అంటిపెట్టకుని ఉన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె ఏపీసీసీ పగ్గాలు చేపట్టగానే ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయిలో స్వేచ్చనిచ్చింది. ఈ స్వేచ్చమేరకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక పూరై్తందని చెప్పొచ్చు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాల్లోనూ షర్మిల రాష్ట్రంలోని పరిస్థితులు, అభ్యర్థులు ఎటువంటి వారైతే బాగుంటుందనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు. దీంతో షర్మిల చెప్పిన వారికి సీట్లు కేటాయించారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి అదే నియోకవర్గంలో టిక్కెట్లు కేటాయించారు. అలాగే ప్రధానమైన వ్యక్తులు, నాయకులు పోటీ చేస్తున్న చోట ఆచీతూచీ అభ్యర్థులను ఎంపిక చేశారు. షర్మిల దరఖాస్తులు చేసుకున్న వారందనినీ ఇంటర్వూ చేసి ఎవరు ఎంత వరకు పార్టీకి పనికొస్తారనే విషయమై ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకే అభ్యర్థులను ఖరారు చేశారు.
ఐదు పార్లమెంట్‌ స్థానాల్లో సీనియర్లు
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ఏపీసీసీ అధ్యక్షురాలు కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రకటించింది. కడప పార్లమెంట్‌ నుంచి వైఎస్‌ షర్మిల పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూలు పార్లమెంట్‌కు పీజీ రాంపుల్లయ్యయాదవ్‌లు పోటీ పడుతున్నారు. వీరంతా కాంగ్రెస్‌ పార్టీలో ధీటైన నాయకులుగా చెప్పొచ్చు. వీరికి పార్టీ ఓటింగ్‌తో పాటు వ్యక్తిగత ఓటింగ్‌ కూడా ఉంది.
అందరిచూపూ షర్మిలపోటీపైనే
కడప స్థానం నుంచి షర్మిల పోటీకి దిగటం సర్వత్రా ఉత్కంఠకు తెరలేచింది. అక్కడి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. ఎలాగైనా ఆయనను ఓడించాలనే పట్టదలతో వైఎస్‌ బిడ్డ రంగంలోకి దూకింది. ఇందుకు కాంగ్రెస్‌ అధిష్టానం భరోసా ఉంది. ప్రచార ఖర్చులు కూడా కాంగ్రెస్‌ పార్టీనే భరించేందుకు నిర్ణయించింది. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పార్టీ ఎక్కువ మొత్తంలో ఖర్చుపెట్టందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. వైఎస్‌ వివేకాను హత్య చేయించిన అవినాష్‌ను ఓడించాలనే నినాదంతో ఎన్నికల ప్రచారంలోకి షర్మిల దూకారు. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా ప్రత్యర్థిని చీల్చి చెండాడారు.
ఇక పిఠాపురం నుంచి జనసేనానిని ఎదుర్కొనేందుకు మేడిపల్లి సత్యానందరావును కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దించింది. ఇక్కడి నుంచి పోటీకి దిగిన వంగా గీతను కూడా సత్యానందరావు సవాల్‌ చేయాల్సి ఉంటుంది. ఇక కుప్పం నుంచి పోటీలోకి ఆవుల గోవిందరాజు పోటీకి దిగారు. ఆయన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు. ఇక్కడ తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ మధ్యే పోటీ ఉంటుందని ఓటర్లు భావిస్తున్నారు. ఎలాగైనా కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్లు దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది. అదే జరిగితే చంద్రబాబు అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నుంచి సాకె శైలజానా«ద్‌ పోటీకి దిగారు. శైలజానా«ద్‌ తప్పకుండా గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. రెండు పోట్ల గిత్తలు తలపడుతుంటే మధ్యలో ఉన్న నాకు అవకాశం రాకుండా పోతుందా? అనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఇక నందికొటుకూరు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలిజాలు కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్‌ సాధించి పోటీకి దిగారు. వీరిరువురూ ఎస్సీ రిజర్వుడు అభ్యర్థులు కావడం విశేషం. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచి ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్‌ బలాన్ని చేకూర్చారు. పులివెందులలో వైఎస్‌ జగన్‌పై ఎవరిని కాంగ్రెస్‌ పార్టీ పోటీకి దించుతుందనేదానిపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.
Tags:    

Similar News