చంద్రబాబుకు ఆరు..పవన్‌ కల్యాణ్‌కి పదో ర్యాంకు

ర్యాంకులు సాధించడంలో సీఎం, డిప్యూటీ సీఎంలు వెనుకబడ్డారు. సీఎం చంద్రబాబు మంత్రుల ర్యాంకులను ప్రకటించారు.;

Update: 2025-02-06 12:28 GMT

విద్యార్థులకు ర్యాంకుల విధానాన్ని అమలు చేస్తున్న విధంగానే ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు కూడా ర్యాంకుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులు ర్యాంకులు సంపాదించుకుంటే.. పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. అందులో తనకు కూడా మినహాయింపు లేదని ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. ఉప ముఖ్యంత్రి పవన్‌ కల్యాణ్‌కు కూడా మినహాయింపు లేదని వెల్లడించారు. గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు ర్యాంకులను వెల్లడించారు.

మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డిసెంబరు వరకు ఫైళ్ల పరిశీలన, వాటి క్లియరెన్స్‌ల ఆధారంగా ర్యాంకింగ్‌ ఇచ్చారు. ర్యాంకింగ్‌లో సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యంత్రి పవన్‌ కల్యాణ్‌ వెనకబడినట్లు వెల్లడించారు. తాను 6వ స్థానంలో నిలవగా.. పవన్‌ కల్యాణ్‌ పదో స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. తన కుమారుడు మంత్రి లోకేష్‌ కూడా మంచి ర్యాంకు పొందడంలో వెనుబడ్డారు. మంత్రి నారా లోకేష్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. సీనియర్‌ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలు కూడా మంచి ర్యాంకులు సాధించడంలో వెనుకబడ్డారు. వాసంశెట్టి సుభాష్, పయ్యావుల కేశవ్‌లు వరుసలో ఆఖరి స్థానాలు దక్కించుకున్నారు.

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అందరి కంటే ముందు మొదటి ర్యాంకు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. తర్వాత కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ 4వ ర్యాంకులో నిలిచారు. 5వ స్థానంలో డోలా బాలవీరాంజనేయస్వామి, 6వ స్థానంలో సీఎం చంద్రబాబు, 7వ స్థానంలో సత్యకుమార్‌ యాదవ్, 8వ స్థానంలో నారా లోకేష్, 9వ స్థానంలో బీసీ జనార్థన్‌రెడ్డి, 10వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిలిచారు.
11వ ర్యాంకులో సవిత, 12వ ర్యాంకులో కొల్లు రవీంద్ర, 13వ ర్యాంకులో గొట్టిపాటి రవికుమార్, 14వ ర్యాకుంలో నారాయణ, 15వ ర్యాంకులో టీజీ భరత్, 16వ ర్యాంకులో ఆనం రామనారాయణరెడ్డి, 17వ ర్యాంకులో అచ్చెన్నాయుడు, 18వ ర్యాంకులో రాంప్రసాద్‌రెడ్డి, 19వ ర్యాంకులో గుమ్మిడి సంధ్యారాణి, 20వ ర్యాంకులో వంగలపూడి అనిత, 21వ ర్యాంకులో అనగాని సత్యప్రసాద్, 22వ ర్యాంకులో నిమ్మల రామానాయుడు, 23వ ర్యాంకులో కొలుసు పార్థసారథి, 24వ స్థానంలో పయ్యావుల కేశవ్, 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్‌లు నిలిచారు.
మంత్రులందరూ గేర్‌ మార్చుకోవాలని, వేగం పెంచి పని తీరును మెరుగు పరుచుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంత్రుల ఫైల్స్‌ క్లియరెన్స్‌ మీద పెర్పార్మెన్స్‌ను సీఎం చదవి వినిపించారు. ఇప్పటి వరకు అయితే పర్వాలేదని, ఇక నుంచి ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Tags:    

Similar News