ఓట్ల కోసం మాయా సైనికులొస్తున్నారు, జాగ్రత్త

సర్వం సోషల్‌ మీడియా మయం. రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాలోనే గడుపుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి. ఏపార్టీలో ఎవరు ఈ భాధ్యతు చూస్తున్నారు.

Update: 2024-03-12 05:31 GMT
Social Media Icons

 కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఆయన తెలంగాణ రాజధానిలో అనేక కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్నారు. ఇందులో అన్నింటికంటే మఖ్యమయిన సమావేశం ఎల్ బి స్టేడియం లో ఉంది. ఆయన అక్కడ 3000 మంది యువకులతోమాట్లాడుతున్నారు. వాళ్లంతా బిజెపి కార్యకర్తలా కాదు, స్వయం సేవకులా? అసలూ కాదు.వాళ్లంతా బిజెపి సోషల్ మీడియా సైనికులు. వాళ్లందరూ యు ట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లతో పాటు అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి బిజెపి గొప్పదనం గురించి, చెబుతారు. బిజెపికి ఎందుకు వోటేయాలో చెబుతారు. మీ మీద కాషాయ వశీకరణ మంత్రం ప్రయోగిస్తారు. వీళ్లే బిజెపి విజయానికి బాట వేస్తారు. బిజెపి ఈ ఎన్నికల్లో చేప్పాల్సిన కథని ప్రజలంతా నమ్మేలా చెబుతారు. అందుకే ఈ రేపటి ఈ సమావేశానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ మూడు వేల్ల మూడులక్షల మైకుల్లాగా బిజెపిని మొబైల్ ఫోన్ ను పట్టుకున్న ప్రతివ్యక్తి కి చేరవేస్తారు. అది నిజమా, అబద్దమా అనేది ముఖ్యంకాదు, నిజం చేతదేన్నయిన వప్పించి వశపర్చుకోవడమే ఈ  మూడువేల మంది పని.

పార్టీనేత ప్రచారం కంటే, జీతాలు తీసుకునే ఈ సోషల మీడియా వలంటీర్ల ప్రచారమే తమ అభ్యర్థులను గెలిపిస్తుందని బిజెపియే కాదు, తెలుగుదేశం,జనసేన, కాంగ్రెస్ పార్టీలు నమ్ముతున్నాయి.

రాజకీయ ప్రచారం  ట్రెండ్‌ మారింది ఇలా. రాజకీయ పార్టీలు డిజిటల్‌ టెక్నాలజీలపై పరుగెడుతున్నాయి. సోషల్‌ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రచారాన్ని నిర్వహించేందుకు పోటీలు పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, జనసేన ఈ బాట పట్టగా తాజాగా కాంగ్రెస్‌ పార్టీ కూడా సామాజిక మాధ్యమాల వైపు దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్‌ షర్మిలా రావడంతో ఇది ఊపందుకుంది. ఏపి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది. మిగిలిన పార్టీలు కూడా సోషల్‌ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నాయి.

సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు 2023లో ఇతర దేశాల్లో కూడా సోషల్‌ మీడియా గ్రూపును ఏర్పాటు చేసింది. అందులో భాగంగా యుఎస్‌ఏ సోషల్‌ మీడియా కమిటీలను ఏర్పాటు ఏర్పాటు చేసి బాధ్యతలను కూడా అప్పగించింది. అడ్వైజరీ టీమ్, సోషల్‌ మీడియా ప్రాపర్టీస్‌ మేనేజ్‌మెంట్, నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్లూఎన్సర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలను ఏర్పాటు చేసింది.
చాలా పనులు సోషల్‌ మీడియా ద్వారానే..
సోషల్‌ మీడియా ద్వారానే ఇప్పుడు చాలా పనులు జరుగుతున్నాయి. ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. యువత మీద సోషల్‌ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే పట్టుకున్నాయి. ప్రత్యేకంగా సోషల్‌ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ ప్రచారాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం.. రెండు.. ప్రత్యర్థులను ట్రోల్‌ చేయడం. సోషల్‌ మీడియాలో నెగెటివిటీ ఎక్కువ. పాజిటివ్‌ అంశాలకు ప్రాధాన్యం లభించదు. కానీ నెగిటివ్‌గా ఏదైనా ఉంటే మాత్రం వైరల్‌ అయిపోతుంది. ఈ టెక్నాలజీ మార్పులను రాజకీయ పార్టీలు బాగా ఉపయోగించుకుంటున్నాయి. జనసేన పార్టీకి కూడా ప్రత్యేకించి సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసింది. 
వైఎస్సార్‌సీపీలో సజ్జల భార్గవ్‌రెడ్డి..
గతంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా గ్రూపు బాస్‌గా ఎంపి విజయసాయిరెడ్డి ఉండేవారు. తర్వాత ఆయనను సిఎం జగన్‌ మార్చేశారు. సాయిరెడ్డిని పక్కన పెట్టి ఓ యువకుడిని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డికి వైసీపీ సోషల్‌ మీడియా గ్రూపు ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించారు.
ఐటీడీపీకి చింతకాయల విజయ్‌..
తెలుగుదేశం పార్టీ పెద్ద నెట్‌వర్క్‌ గా సోషల్‌ మీడియా గ్రూపు నడిపిస్తోంది. దీనిని ఐటీడీపీ అని పిలుస్తుంటారు. ఐటీడీపీ పేరుతో సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నారు. దీని బాధ్యతలను కూడా ఒక యుకుడైన నేతకు ఆ పార్టీ పెద్దలు అప్పగించారు.
మాజీ మంత్రి, సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడైన చింతకాయల విజయ్‌కి ఐటీడీపీ ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించారు. చింతకాయల విజయ్‌ నేతృత్వంలో కార్యకలాపాలు సాగిస్తోంది. నిర్వహణ నిమిత్తం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఉద్యోగులను నియమించుకుంటున్నారు. వేలల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. హైదరబాద్‌తో పాటు అమరావతిలో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఆఫీసులు ఉన్నాయి. విదేశాల్లో కూడా ప్రత్యేక టీమ్‌లు ఉన్నాయి. ప్రత్యేక కమిటీలను కూడా ఫామ్‌ చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌తో పాటుగా గల్ఫ్‌ కంట్రీల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అవసరమైన కంటెంట్‌ను తయారు చేస్తారు. అందంగా, ఆకర్షణీయంగా తయారు చేయిస్తారు. అంతే త్వరగా క్షణాల్లో ప్రజలకు చేర వేస్తారు.
కాంగ్రెస్‌లో 14 మంది..
కాంగ్రెస్‌ పార్టీ 14 మంది సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ కో ఆర్డినేటర్లు పనిచేస్తారు. వీరికి పార్టీ ఆఫీసుల్లో ప్రత్యేకించి ఒక కార్యాలయం ఉంటుంది. ఈనెల 7వ తేదీన ఈ వింగ్‌కు కో ఆర్డినేటర్లను నియమిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆదేశాలు జారీ చేశౠరు.
తక్షణ సమాచారం..
రాజకీయ నాయకులు తమ విధానాలు, వీక్షణలు, ప్రచార నవీకరణలను తక్షణమే పంచుకోవచ్చు. ర్యాలీలు, ఈవెంట్‌లు, నిధుల సేకరణ కోసం మద్దతుదారులను సమీకరించడంలో సోషల్‌ మీడియా సహాయం చేస్తుంది. ఇది ప్రజాభిప్రాయాన్ని రూపొందించి, ప్రచారానికి ఒక శక్తివంతమైన సాధనంగా చేస్తుంది.
పౌరులు రాజకీయ నాయకుల చర్యలను పర్యవేక్షించగలరు కాబట్టి పారదర్శకత, జవాబుదారీతనం కోసం అనుమతిస్తుంది. అయినప్పటికీ, ఇది తప్పుడు సమాచారం, ఎకో ఛాంబర్‌లు, సైబర్‌టాక్‌లతో సహా సవాళ్లను కూడా అందిస్తుంది. ఆధునిక ఎన్నికల ప్రచారాలలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది, ఓటరు ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది.
పెరుగుతున్న వినియోగదారులు
భారతదేశంలో మొబైల్‌ కనెక్షన్ల 1.14 బిలియన్లు ఉన్నాయి. సోషల్‌ మీడియా వినియోగదారుల వార్షిక వద్ధి రేటు 4.2శాతం. అంటే సంవత్సరానికి 19 మిలియన్లకు పైగా వినియోగదారులు పెరుగుతున్నారు. సగటున, వినియోగదారులు సోషల్‌ మీడియాలో రోజుకు 156 నిమిషాలు గడుపుతున్నారు.
సోషల్‌ మీడియా.. నెట్‌వర్క్‌.. వేరువేరు
సోషల్‌ మీడియా అనేది సమాచారాన్ని భాగస్వామ్యం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌. సోషల్‌ నెట్‌వర్క్‌ అనేది కనెక్ట్‌ చేయడానికి ఉపయోగించే కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫారమ్‌. ఒకే ప్లాట్‌ఫారమ్‌ సోషల్‌ మీడియా, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫారమ్‌గా పని చేస్తుంది.
Tags:    

Similar News