గెలిచేవి కొన్ని... అది సరే.. ఓడిపోయేవి ఎన్ని?

ఎన్నికల్లో పొత్తుల ఎత్తులు మామూలే. పొత్తుల్లో లౌకికంగా పోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే గెలుపు ఓటముల సీట్ల విషయం తెరపైకి వచ్చింది.;

Update: 2024-01-24 12:29 GMT
పొత్తులపై చర్చించుకుంటున్న చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌ (పాత ఫొటో)

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా తేలలేదు. ఎక్కడెక్కడ ఏపార్టీ సీటు ఎగురుతుంది? ఎవరికి దక్కుతుంది? ఇదీ ప్రస్తుతం జరుగుతున్న చర్చ. గెలిచే సీట్లు కొన్ని.. ఓడిపోయే సీట్లు.. కొన్ని, ఇదీ ఇప్పుడు తెలుగుదేశం, జనసేన మధ్య జరుగుతున్న చర్చ. తప్పనిసరిగా గెలిచే సీట్లలో కొన్నింటిని జనసేనకు కేటాయించి అటుఇటుగా ఉన్న సీట్లను కూడా కొన్నింటిని జనసేనకు కేటాయించాలనే ఆలోచనలో చంద్రబాబునాయుడు ఉన్నారు. దాదాపు ఇప్పటికే ఎక్కడెక్కడ పోటీలో ఉంటామనే ప్రతిపాదన జనసేన నుంచి చంద్రబాబుకు అందింది. దీనిపై ఆచీతూచీ నిర్ణయం తీసుకునే పనిలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబునాయుడు పొత్తుల విషయంలో ఎప్పుడూ ముందుగా తేల్చడు. చివరి రోజుల్లో మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకుంటారు.

ఇప్పుడు అలా కాకుండా ముందుగానే నిర్ణయం తీసుకోవాలనే ప్రతిపాదన పవన్‌కళ్యాణ్‌ నుంచి ఎదురైంది. దీంతో ముందుగానే సీట్ల సర్ధుబాటు పూర్తయి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వచ్చేనెలాఖరులో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని ఎన్నికల సంఘం సూచన ప్రాయంగా ఇప్పటికే అంగీకరించింది. అంటే కనీసం ఫిబ్రవరి మొదటి వారంలోనైనా పొత్తుల సీట్లు ప్రకటిస్తారా లేదా అనే చర్చ సాగుతున్నది. ఇక్కడ గెలుపు ఓటముల సీట్ల విషయం వచ్చే సరికి ఓటమి సీట్లలో అభ్యర్థులు రెండు పార్టీల నుంచి ముందుకు రావడం లేదని సమాచారం. గెలిచే సీట్లలో పోటీ పెరిగింది. ఎక్కువ మొత్తం పార్టీ ఫండ్‌ ఇవ్వడానికి కూడా అభ్యర్థులు రెడీగా ఉన్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం 32 సీట్ల వరకు జనసేన ప్రతిపాదించింది. ఇందులో గెలుపు ఓటములతో సంబంధం లేదని, మేము ఆ విషయం చూసుకుంటామని జనసేన వారు అంటున్నారు. అయితే జనసేన ప్రతిపాదించిన సీట్లలో ఎక్కువగా టీడీపీ గెలిచే సీట్లే ఉన్నట్లు టీడీపీ వారు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గెలుపు ఓటముల సీట్ల సర్ధుబాటు ఎప్పటికి పూర్తవుతుంది. దీనిపై ఒక ప్రత్యేక సమావేశం ఏదైనా ఇరు పార్టీల మధ్య జరుగుతుందా? లేదా? అనే చర్చ కూడా ఇరు పార్టీల్లో మొదలైంది.
Tags:    

Similar News