శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబెు

తిరుమల కల్యాణవేదిక వద్ద ఫ‌ల‌పుష్ప‌, అట‌వీ, శిల్ప‌, ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లను ఏర్పాటు చేస్తుంది. కొన్ని ఫోటోలు..

Update: 2025-09-23 13:00 GMT

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సన్నద్ధమైంది. ఈ ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తోంది. సాలకట్ల అంటే వార్షిక సంప్రదాాయం. సాల్ అనేది హిందీ మాట. ఉత్తరాదికి మహంతులు తిరుమల అధిపతులుగా ఉన్నపుడు ఈ పదం శ్రీవారి సేవలోకి ప్రవేశించింది. కట్ల అంటే సంప్రదాయం. అంటే సంవత్సరం వేడుక అని అర్థం. ఇక బ్రహ్మోత్సవం అంటే  కన్యారాశి లో శ్రవణా నక్షత్రం రోజున జరిగే ఉత్సవం. దీనినే నవరాత్రి బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. ఇపుడు తిరుమల ఈ సాలకట్ల ఉత్సవాలకు ముస్తాయింది. దీనికోసం తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఫ‌ల‌పుష్ప‌, అట‌వీ, శిల్ప‌, ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లను  ఏర్పాటు చేశారు. ఆ అలకంరణలకు సంబంధించి కొన్ని ఫొటోలు.. 

 

 

 

 

 

 

 

 సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ 16 రకాల వంటకాలను అందించనుంది.

 

 

Tags:    

Similar News