Ratha Saptami in Tirumala | సూర్యుడి వాహనంగా మలయప్ప విహారం
శ్రీవైష్ణవ క్షేత్రాల్లో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సూర్యుడి కిరణాలు సోకగానే తిరుమలలో ఉభయ నాంచారులతో మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించారు.;
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన తరువాత శుద్ధ దశమిని సూర్యజయంతిని రథసప్తమిగా భావిస్తారు. రథం (పల్లకి) సప్తమి( ఏడు). నిర్వహించడం ఆనవాయితీ. దీనిని ఒక రోజు బ్రహ్మోత్సవంగా కూడా పరిగణిస్తారు. అందుకు కారణం ఏడు వాహనాలపై శ్రీనివాసుడిగా అవతరించిన శ్రీవేంకటేశ్వరస్వామి విహరిస్తారు. మంగళవారం ఉదయం 5.30 నుంచి ఎనిమిది గంటల వరకు (సూర్యోదయం 6.44 AM) సూర్య ప్రభ వాహనం ప్రారంభమైంది. రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహనంతో ఉత్సవాలు ముగుస్తాయి.
మంచు తెరలు తొలిగే వేళ...
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెస్ రాజు, పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జీ. భానుప్రకాష్ రెడ్డి, ఎన్. సదాశివరావు, శ్రీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
వైష్ణవ క్షేత్రాల్లో