వ్యూహాత్మక రాజీనామా!

ఆంధ్రప్రదేశ్‌ ఉమెన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలం ఇంకా ఆరు నెలలు ఉంది. అయినా ముందుగానే రాజీనామా చేశారంటే వ్యూహాత్మకమేనని చెప్పాలి.

Update: 2024-03-07 12:57 GMT
Vasireddy Padma, Womans Commission Chairperson

వాసిరెడ్డి పద్మ. ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో ఈ పేరు వినని వారు ఉండరు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచార సభలకు ముదుగా వెళ్లి వేదికలపై జనానికి నాలుగు మాటలు చెప్పి వారిని కదలకుండా చేసే బాధ్యతలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈమెకు ఉమెన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. కేవలం జగన్‌ వెంట తిరిగిన వారికి చాలా మందికి ప్రభుత్వంలో పదవులు లభించాయి. మరికొందరికి పదవులు అందలేదు. అది వేరే విషయం అనుకోండి.

ఆరునెలల ముందే రాజీనామా
పదవీ కాలం ఆరు నెలలు ఉంది. ఎన్నికలు మూడు నెలలలు ఉన్నాయి. ఆరునెలలు అలాగే ఉంటే తిరిగి పదవి దక్కుతుందో దక్కదో. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవిని దక్కించుకున్నాం. సీఎం చెప్పినట్లు ప్రచారంలోకి దూకితే బాగుంటుంది. అందుకే రాజీనామా చేస్తున్నట్లు నేరుగా మీడియా ముందే చెప్పారు. తన రాజీనామా పత్రంలోనూ ఇదే రాసి రాజీనామా చేశారు.
ఇది వ్యూహంలో భాగమే..
తాను ఉమెన్స్‌ కమిషన్‌ పదవికి రాజీనామా చేసినా మనసులో మాత్రం ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఇటీవల ఈ విషయాన్ని సీఎం జగన్‌ వద్ద వాసిరెడ్డి పద్మ చెప్పినట్లు సమాచారం. ఆ మాటలు విన్న జగన్‌ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు తప్ప ఏమీ మాట్లాడలేదు.
పాదయాత్రలో ముదు భాగాన
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా నడక ముగిసే సమయానికి ఏర్పాటు చేసే సభల్లో ముందుగా వాసిరెడ్డి మాట్లాడేవారు. మంచి మాటకారి కావడంతో వచ్చిన జానాన్ని ఆకట్టుకునే వారు. అలాగే ఎన్నికల సభల్లోనూ మహిళల పక్షాన మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయంతో ఈమెను ఎన్నికల సభల్లో ప్రచారానికి వెళ్లాల్సిందిగా సీఎం జగన్‌ ఆదేశించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి ఎన్నికల సభల్లో జనాన్ని నిలబెట్టేందుకు ముందుగా మాట్లాడేందుకు ఒక బ్యాచ్‌ ఉంటుంది. ఆ బ్యాచ్‌లో ముందు వరుసలో వాసిరెడ్డి పద్మ ఉండే అవకాశం ఉంది. కళా కారుల బృందాలు కూడా ఏర్పాటవుతున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో వంగపండు కుమార్తె వంగపండు ఉష పాటలు పాడే బృందానికి నాయకత్వం వహించారు. ఆమె కూడా మంచిగా పాటలు పాడి జానాన్ని ఆకట్టుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Tags:    

Similar News