ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడారు.
"ప్రతినిధులకు శాఖాహార వంటకాలు వడ్డించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర పార్టీ కార్యాలయం దీనిని పర్యవేక్షిస్తోంది" అని గిరిధర్ రెడ్డి చెప్పారు. ఈరోజు రాత్రికి ఈ అంశంలో క్లారిటీ వస్తుంది అని ఆయన తెలిపారు. క్యాటరింగ్ విజయవాడ ప్రాంతానికి చెందిన వారికి అప్పగించే అవకాశం ఉంది.
మహానాడు ప్రాంగణంలో అల్పాహారం, భోజన వసతి కల్పించడానికి సుమారు ఆరు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతినిధులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలోనే నాయకులకు టోకెన్లు జారీ చేస్తారు. ఆ టోకెన్లతో నచ్చిన ఫుడ్ కోర్టులో కోరిన ఆహార పదార్థాలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అల్పాహారంలో వంటకాలు
రాయలసీమలో తిరుపతి తర్వాత కడపలో మొదటిసారి టిడిపి మహానాడు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర వంటకాలతో పాటు రాయలసీమ రుచులతో వంటకాలు వడ్డించనున్నారు.
కడపలో ఈనెల 27వ తేదీ ప్రారంభమయే టిడిపి మహానాడుకు 40 వేల మంది ప్రతినిధులకు హాజరయ్యే వారికి అల్పాహారం, భోజన వసతి కల్పించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఉదయం అల్పాహారం : కడప మహానాడులో ప్రతినిధులకు ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, వడ, పొంగల్, విభిన్న రకాల చట్నీలు, సాంబార్, కారప్పొడి, నెయ్యి వడ్డించనున్నారు. ఆ తర్వాత టీ, కాఫీ కూడా అందించడానికి ఏర్పాటు చేయనున్నారు.
మధ్యాహ్న భోజనం: కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జి, బగారా రైస్, కొబ్బరి అన్నం లేదా వెజ్ పులావ్, పుల్కా లేదా చపాతి, సొరకాయ పప్పు, చెట్ని, కారంపొడి, తెల్లా అన్నం,
కూరలు: భోజనం లోకి జీడిపప్పుతో కలిపిన టమాట ములక్కాయ, అప్పడాలు, గుత్తి వంకాయ, ఉలవచారు, రసం, పెరుగు, కేక్, కూల్ డ్రింక్ తో పాటు పాన్ (తాంబూలం) అందుబాటులో ఉంచనున్నారు. మధ్యాహ్నం భోజనంలో కాజు చికెన్ కర్రీ, ఎగ్ మసాలా తో కూడిన 22 రకాల వంటకాలు వడ్డించరున్నారు.
టిడిపి ఎన్నారై సెల్ జర్మనీ విభాగం ఈ ఏర్పాటును పరివేక్షిస్తున్నట్లు టిడిపి సీనియర్ నాయకుల ద్వారా తెలిసింది. గతంలో శాఖాహారానికి పరిమితమైన వంటకాలలో రెండు నాన్ వెజ్ పదార్థాలను కూడా చేర్చింది. కడపలో జరిగే మహానాడులో కూడా మెనూ మార్పు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
విజయవాడ నుంచి క్యాటరింగ్?
కడపలో నిర్వహించే మహానాడుకు కూడా విజయవాడకు చెందిన ప్రముఖ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ప్రతినిధికే కాంట్రాక్టు అప్పగించినట్లు తెలుస్తోంది.
2023 రాజమండ్రిలో నిర్వహించిన టిడిపి మహానాడుకు అంబికా కేటరింగ్ ప్రతినిధులకు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో 50 వేల మందికి రుచికరమైన, నోరు గురించే వంటకాలను వడ్డించారు.
మహానాడుకు హాజరైన ప్రతినిధులు, పోలీస్ శాఖతోపాటు వివిధ విభాగాల సిబ్బంది, వాలంటీర్లకు కూడా ఆహార పదార్థాలను తయారు చేయడానికి 1500 మంది వంటవాళ్లు పనిచేశారు. వారంతా 2 వంటకాలను నిధుల కోసం సిద్ధం చేశారు. మహాసభలో శనివారం కావడంతో అల్పాహారంలో ఇడ్లీ, పొంగల్, టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్, మైసూర్ బజ్జీ, వడ, పునుగులు వడ్డించారు. ఇవన్నీ ఆ ప్రాంతానికి సంబంధించిన వంటకాలు. ఫుడ్ కోర్టుల వద్ద 10 లక్షల వాటర్ బాటిళ్లు, మరో 10 లక్షలు వాటర్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచారు.
మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు వెజ్ బిర్యానీ, బెండకాయ, గుత్తి వంకాయ, బెండకాయ ఫ్రై, టమాటా మునక్కాడ, మామిడికాయ పప్పు, దొండకాయ ఫ్రై, బంగాళాదుంప, khurma, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, మామిడి ఆవకాయ, దోస ఆవకాయ, సాంబార్, మజ్జిగ పులుసు, పెరుగు, కాకినాడ కాజా, తాపేశ్వరం గొట్టం కాజా, యాపిల్ హల్వా, జిలేబి కూడా వడ్డించడానికి రాజమండ్రి నుంచి కీలకంగా వ్యవహరించిన టిడిపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యవేక్షించారు.
2016లో తిరుపతిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులో వంటకాలు వడ్డించారు. 30 రకాల వంటకాలు తయారు చేయడానికి పాకశాస్త్ర నిపుణులను ప్రత్యేకంగా రప్పించారు. ఏర్పాట్లను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పర్యవేక్షించారు. శనివారం మినహా మిగతా రెండు రోజులు మాంసాహారం వంటకాలను కూడా వడ్డించారు.
కడప వెలుపల కూడా వసతి
మహానాడుకు హాజరయ్యే వారికి కడప పట్టణంలో వసతి సరిపోవడం లేదు. దీంతో కడప నగరంలో సీఎం చంద్రబాబు, మంత్రివర్గ సహచరులు, ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ సీనియర్ నాయకులకు ప్రైవేట్ హోటల్లులో వస్తే కల్పించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులకు వసతి కల్పించడం ఇబ్బంది కరంగా మారింది. అందువల్ల జిల్లాలోని సమీప ప్రాంతాలు మైదుకూరు, పొద్దుటూరు, పులివెందులతో సహా గ్రామాలలో కూడా పార్టీ ప్రతినిధులు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూడా వసతి ఏర్పాటు చేశారు.
"నగరంలో అందరికీ వసతి కష్టం కావడం వల్ల ఈ ఏర్పాట్లు చేశాం"అని టిడిపి నాయకుడు ఒకరు చెప్పారు. సమీప గ్రామాల్లోని ఇళ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ప్రతినిధి తెలిపారు.