వల్లభనేని వంశీపై టీడీపీ వీడియో
మొన్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసిన టీడీపీ తాజాగా వల్లభనేని వంశీమీద మరో వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే..;
By : The Federal
Update: 2025-02-15 07:56 GMT
టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రచారం చేయడంలో టీడీపీ ఎప్పుడూ ముందే ఉంటుంది. క్రియేటివిటీతో వీడియోలు రూపొందించడం, వాటిని ప్రజల్లోకి వదలడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నివాసం సమీపంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలకు, లిక్కర్ స్కామ్‌కు లింకెట్టి ఓ వీడియోను తయారు చేయగా, తాజాగా అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద మరో వీడియో తయారు చేసి ప్రజల్లోకి వదిలారు. ఇది వైరల్‌గా మారడంతో తాజా చర్చ నీయాంశంగా మారింది. వీటిని టీడీపీ తన అధికారిక సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
వంశీ మీద టీడీపీ సోషల్ మీడియాలో..
వల్లభనేని వంశీ అరాచక వాది, ఆయన చేసిన దాడులు, దౌర్జన్యాలకు అడ్డులేకుండా పోయిందంటూ తెలుగుదేశం పార్టీ తన అధికారిక సామాజిక మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. పోస్టులో ఏమని పేర్కొన్నారంటే.. ‘మానవత్వం అనేది మచ్చుకైనా లేని కరుడుగట్టిన అరాచకవాది వల్లభనేని వంశీ గన్నవరం నియోజక వర్గంలో పాల్పడిన దాడులు, దౌర్యన్యాలకు అంతేలేదు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనల ఫొటోలు తీశారని కడపకి చెందిన టీడీపీ నేత మాధవి రెడ్డిపై తన కిరాయి మూలతో దాడి చేయించాడు వంశీ’ అంటూ పేర్కొన్నారు.
ఇక వీడియోలో ఏముందంటే..
పిల్ల సైకో వంశీ గన్నవరంలో చేసిన దుర్మార్గాల్లో ఇదొక దుర్మార్గం.. అంటూ హెడ్డింగ్‌తో వీడియో మొదలవుతుంది. ఈ హెడ్డింగ్‌కు ఒక పక్క జగన్, మరో పక్క వల్లభనేని వంశీ ఫొటోలను పెట్టారు. ఈ రెండు ఫొటోలను బ్లాక్ అండ్ వైట్‌లోను, టైటిల్‌ను మాత్రం తెలుపు ఎరుపు రంగులతో రూపొందించారు. చూడటాని ఇది ఓ సినిమా స్టైల్‌లో కనిపిస్తుంది. వీక్షకులను ఆకట్టుకునే విధంగా టైటిల్ ఫాంట్, కలర్స్, ఫొటోలను అమర్చారు. సిద్ధం పోస్టర్ కనిపిస్తే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన మాధవి గారు అనే మరో రెండు లైన్ల అక్షరాలు అలా జూమ్‌లో తెరపైకి వస్తాయి. వెంటనే ప్రస్తుతం కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వీడియో దర్శనిమిస్తుంది.
అందులో సిద్ధం పోస్టర్ పొటోను చూపిస్తూ మాట్లాడిన మాటలు ఉంటాయి. ఆమె పక్కనే ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ దర్శనమిస్తారు. అందులో మాధవీ రెడ్డి ఏమన్నారంటే.. సిద్ధం పోస్టర్ ఇంకా ఉంది. మీడియా ద్వారా దీని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కఠినంగా పని చేసే విధంగా దీనిని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నా అనే మాటలు వినిపిస్తాయి. తర్వాత వెంటనే మరో స్క్రోలింగ్ తెరపైకి వస్తుంది. ఫొటోలు తీస్తున్నారంటూ వైసీపీ సైకోలు 50 మంది మాధవీ గారి కారును చుట్టుముట్టారు అంటూ రెండు లైన్లతో కూడిన స్క్రోలింగ్ తెరపైకి జూమ్‌లో వస్తూ కనిపిస్తుంది. వెంటనే కార్ సీన్ కనిపిస్తుంది. కట్ చేస్తే ఓ కార్ ముందు సీటు భాగం కనిపిస్తుంది.
కారు ముందున్న జనాలను అందులో నుంచి బయటకు వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే వైసీపీ మహిళా సైకోలతో మాధవి గారు, తనతో కారులో ఉన్న మహిళలపై దాడికి ప్రయత్నం అంటూ మరో స్క్రోలింగ్ స్క్రీన్ మీద దర్శనమిస్తుంది. తర్వాత తానే కార్‌లో ఉన్నట్లు మాధవి రెడ్డి వీడియోలో కనిపిస్తారు. వెంటనే మాధవి గారి కారుకు ముందు భాగంలో వ్యాను, వెనుకభాగంలో బైకు అడ్డుపెట్టిన పిల్లసైకో వంశీ గ్యాంగ్ అంటూ పసుపు, ఎరుపు మిక్సి అయిన రంగంలోని మూడు లైన్ల స్క్రోలింగ్ కనిపిస్తూ జూమ్ అవుట్ అయిపోంది. తర్వాత మళ్లీ వీడియో తీస్తున్నట్లు క్లిప్పింగ్ కనిపిస్తుంది. పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే వచ్చిన కానిస్టేబుల్ మీ మీద ఫిర్యాదు ఇస్తారంట..కిందిగి దిగండి అని మాధవి గారితో అడ్డగోలు వాదన.
అంటూ ఒకటి పెద్ద సైజు, మరోకటి చిన్న సైజులో ఉన్న రెండు లైన్ల స్క్రోలింగ్ దర్శనమిస్తుంది. తర్వాత వెంటనే కార్ సీన్ వస్తుంది. నేనెందుకు పోలీసు స్టేషన్ రావాలి. నోటీసులు ఇస్తే వస్తాను. నేనేమీ కంప్లెయింట్ ఇవ్వలేదే అంటూ పోలీసు కానిస్టేబుల్‌తో జరిగిన వాగ్వాదం కనిపిస్తింది. ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనను తాజాగా వల్లభనేని వంశీ అరెస్టు అయిన నేపథ్యంలో.. రెండింటికి ముడిపెట్టి రూపొందించిన వీడియోను ఇటీవల విడుదల చేశారు.