ఉగ్ర దాడి–కావలికి తరలించిన మధుసూదన్ భౌతికకాయం
కశ్మీర్ ఉగ్రవాదుల తూటాలకు బలైన మధుసూదన్ భౌతికకాయాన్ని కావలికి తరలించారు.;
కశ్మీర్‌లో ఉగ్ర దాడి ఆంధ్రప్రదేశ్‌ను శోక సముద్రంలోకి నెట్టింది. మంగళవారం జరిగిన పహల్గామ్‌లో ఉగ్ర మూకలు జరిపిన పాశవిక దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అనామకులు బలయ్యారు. వీరిలో చంద్రమౌళి విశాఖకు చెందిన వారు కాగా సోమిశెట్టి మధుసూదన్ కావలికి చెందిన వారు. విశాఖకు చెందిన చంద్రమౌళి భౌతికకాయం బుధవారం రాత్రి విశాఖపట్నంకు చేరుకోగా, మధుసూదన్ భౌతికకాయం గురువారం ఉదయం కావలికి చేరుకుంది. గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఘటన స్థలం నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మధుసూదన్ పార్దివ మృతదేహాన్ని కావలికి తరలించారు.
మధుసూదన్ మృతదేహం కావలికి తరలించారనే సమాచారం తెలుసుకున్న బంధుమిత్రులు, స్థానికులు మధుసూదన్‌కు నివాళులు అర్పించేందుకు భారీగా తరలి వస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం ఉగ్ర దాడిలో మధుసూదన్ మృతి చెందారనే వార్తతో కావలిలో విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న మధుసూదన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.